ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ ఏర్పాటుకు చర్యలు

ABN, First Publish Date - 2021-04-21T06:03:35+05:30

దర్శిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా క్వారంటైన్‌ ఏర్పాటుకు అధికారులు మంగళవారం మోడల్‌స్కూల్‌ను పరిశీలించారు.

కందుకూరులో జరుగుతున్న క్లోరినేషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి, ఏప్రిల్‌ 20 : దర్శిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా క్వారంటైన్‌ ఏర్పాటుకు అధికారులు మంగళవారం మోడల్‌స్కూల్‌ను పరిశీలించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి జి.వి.నారాయణరెడ్డి, ఎంపీడీవో జి.శోభన్‌బాబు తదితరులు మోడల్‌స్కూల్లో వనరులను పరిశీలించారు. గతేడాది కూడా ఇక్కడే క్వారంటైన్‌ ఏర్పాటు చేసినందున అనువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో కె.రఘురామయ్య, నగర పంచాయతీ కమిషనర్‌ ఆవుల సుధాకర్‌ పాల్గొన్నారు.

సీఎ్‌సపురం : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 42 మందికి మంగళవారం కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఫ్రంట్‌లైన్‌ వారియర్లు 30 మందికి కరోనా నివారణ వ్యాక్సిన్‌ వేశారు. 

పామూరు : పామూరు, బొట్లగూడూరు, ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం 100 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు పి.రాజశేఖర్‌, కె.కామక్షయ్యలు తెలిపారు. 42 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్ల రెండవ విడత వ్యాకిన్‌ వేసినట్లు తెలిపారు. ఇక  పట్టణంలోని పోస్టాపీసులో సబ్‌ పోస్టుమాస్టర్‌కు సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీం తో రెండు రోజుల నుండి సబ్‌ పోస్టాఫీసుకు తాళాలు వేశారు. పోస్టల్‌ సేవలు నిలిపివేయడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

కరోనాతో మరో యువకుడు మృతి 

కందుకూరు : పట్టణ ంలో కరోనాతో మంగళవారం మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. పట్టణ ంలోని పోతురాజు మిట్ట సమీపంలో నివసించే వ్యక్తి నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం కోసం ఆ యువకుడిని నెల్లూరులోని వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నప్పటికీ ఫలితం లేక మృతిచెందాడు.నాలుగు రోజుల వ్యవధిలో కందుకూరు పట్టణ ంలో కరోనా కారణ ంగా మృతిచెందిన వారి సంఖ్య ఐదుకి చేరింది. దీంతో పట్టణంలో క్లోరినేషన్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-04-21T06:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising