ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెకండ్‌ డోసుకే ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-05-05T06:32:10+05:30

జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోసు వేయించుకోవాల్సిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడో, రేపో కొవాగ్జిన్‌ రాక

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 4 : జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోసు వేయించుకోవాల్సిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి డోసు వేయించుకొని నెలరోజులు దాటిన వారందరికీ బుధవారం నుంచి సెకండ్‌ డోసు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల మందికి మొదటి డోసు వేయగా వారిలో 2.5లక్షల మందికి రెండో డోసు పూర్తి చేశారు. ఇంకా 2.5లక్షలమంది వరకు పెండింగ్‌లో ఉన్నారు. దీంతో మొదటి డోసు వేయించుకునే వారిని కొద్దిరోజులు నిలుపుదల చేసి రెండో డోసు వారికి టీకా ఇవ్వనున్నారు. జిల్లాకు బుధవారం 10వేల డోసులు కొవిషీల్డ్‌ రానుంది. దానిని రెండో డోసు వేసేందుకు వినియోగించనున్నారు. కాగా కొవాగ్జిన్‌ పక్షంరోజుల నుంచి అందుబాటులో లేదు. దీంతో సెకండ్‌ డోసు సమయం దాటిపోతుండటంతో అటువంటి వారందరికీ గురువారం నుంచి వేయనున్నట్లు తెలిసింది. జిల్లాకు ముందుగా 3వేల డోసుల కొవాగ్జిన్‌ రానుందని, ఆ టీకా మొత్తాన్ని సెకండ్‌ డోసుకు వినియోగిస్తామని అధికారుల సమాచారం.



Updated Date - 2021-05-05T06:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising