ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్శి నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహలు

ABN, First Publish Date - 2021-10-19T06:15:31+05:30

దర్శి నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా అధికారులు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలోనే వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. దర్శి నగర పంచాయతీలో మొత్తం 27,694 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 13,700 మంది, మహిళలు 13,974 మంది ఉన్నారు. వీరిలో ఓసీలు 12,482 మంది, బీసీలు 10,610 మంది, ఎస్సీలు 3,637 మంది, ఎస్టీలు 945 మంది ఉన్నారు.

దర్శి నగర పంచాయతీలోని ప్రధాన సెంటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు

దర్శి, అక్టోబరు 18 : దర్శి నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా అధికారులు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు  చేస్తున్నారు. గతంలోనే వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. దర్శి నగర పంచాయతీలో మొత్తం 27,694 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 13,700 మంది, మహిళలు 13,974 మంది ఉన్నారు.  వీరిలో ఓసీలు 12,482 మంది, బీసీలు 10,610 మంది, ఎస్సీలు 3,637 మంది, ఎస్టీలు 945 మంది ఉన్నారు. దర్శి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా జనరల్‌ 4, జనరల్‌ మహిళ 6, బీసీ 3, బీసీ మహిళ 3, ఎస్సీ 2, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్‌ 1 వార్డుకు రిజర్వు చేశారు. మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 19వ తేదీన పోలింగ్‌ కేంద్రాల వివరాలను జిల్లా అధికారులకు పంపుతారు. 20వ తేదీన కేంద్రాలను పబ్లికేషన్‌ చేస్తారు. 21వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 22వ తేదీన అభ్యంతరాలపై పరిశీలన, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. 23వ తేదీ పోలింగ్‌ స్టేషన్‌ల పైనల్‌ పబ్లికేషన్‌ విడుదల చేస్తారు. అదేరోజు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని సమాచారం. దర్శి నగర పంచాయతీకి అకస్మాత్తుగా ఎన్నికలకు రంగం సిద్ధం కావటంతో రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. 


Updated Date - 2021-10-19T06:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising