ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతానికి కృషి చేయండి

ABN, First Publish Date - 2021-07-31T06:54:36+05:30

రానున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడడం ద్వారా కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పేలా చూడాలని కందుకూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.నాగేశ్వరరావు కోరారు.

లోక్‌అదాలత్‌పై సమావేశమైన జడ్జీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూలై 30: రానున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడడం ద్వారా కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పేలా చూడాలని కందుకూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.నాగేశ్వరరావు కోరారు. సెప్టెంబరు 11న జరుగనున్న జాతీయ లోక్‌అదాలత్‌పై శుక్రవారం కందుకూరు కోర్టుహాలులో న్యాయవాదులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కారమవ్వాలంటే న్యాయవాదుల సహకారం ఎంతో కీలకమన్నారు. ఇప్పటి నుండే న్యాయవాదులంతా తమ పరిధిలో ఉన్న కేసులను పరిశీలించా లన్నారు. తద్వారా అవకాశం ఉన్న కేసులన్ని జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా కక్షిదారులను సిద్ధం చేయాలని సూచించారు. లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పడమే గాక ఇరుపక్షాలు విజయం సాధించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. బాబు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ హరికృష్ణ, అధికసంఖ్యలో సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising