ప్రేమ కిషోర్ జీవితం రచనలు స్ఫూర్తిదాయకం
ABN, First Publish Date - 2021-10-08T05:51:32+05:30
ప్రముఖ రచయితా, కవి దివంగత రావినూతల ప్రేమకిశోర్ జీవితాన్ని నేటితరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి
కందుకూరు, అక్టోబరు 7 : ప్రముఖ రచయితా, కవి దివంగత రావినూతల ప్రేమకిశోర్ జీవితాన్ని నేటితరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రేమకిశోర్ స్మారక కవితా పురష్కారంలో భాగంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రేమ కిశోర్ రచించిన ‘అక్షరం’ 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం హర్షించ దగ్గ విషయమన్నారు. అమ్మ గొప్పతనం, ఔనత్యం గురించి గొప్పగా తెలియజేశాడన్నారు. అంతటి గొప్ప కవిది కందుకూరు ప్రాంతం కావడం, బాలుర ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించడం మనందరికి గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. తొలుత ప్రేమ కిశోర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించాడు. ‘అక్షరం’ పై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతకలు బహుమతులు అందించారు. కార్యక్రమానికి సభాధ్యక్షుడు గౌడపేరు కోటిలింగం వ్యవహరిచగా, గౌరవ అతిథులు ప్రముఖ రచయిత, కవి పాటిబండ్ల ఆనందరావు, ప్రముఖ కవి నూకతోటి రవికుమార్, ఏంఈవో నాగేంద్రవదన్, ప్రధానోపాధ్యాయరాలు డీ.అనురాధ, కే.ద్వారకారాణి, మాచవరం ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి, కే జనార్ధనరావు, పూర్వ విద్యార్ధులు కే మోహనరావు, బీ గోవిందయ్య, సీహోచ్ శ్యాంసుందర్, కత్తి ఐజక్, డీ.బిక్షాలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-08T05:51:32+05:30 IST