ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభానికి నోచుకోని స్త్రీశక్తి భవనం

ABN, First Publish Date - 2021-10-18T04:31:33+05:30

మండల కేంద్రమైన పుల్లలచెరువులో స్త్రీ శక్తి భవన నిర్మాణం ఇంకా పూర్తి కా లేదు.

నిర్మాణ పనులు పూర్తికాని స్త్రీశక్తి భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనిమిదేళ్లుగా పూర్తికాని పనులు

అద్దె ఇంట్లో సాగుతున్న కార్యాలయం

ఇబ్బంది పడుతున్న ఐకేపీ సిబ్బంది

పీఆర్‌ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

పుల్లలచెరువు, అక్టోబరు 17:  మండల కేంద్రమైన పుల్లలచెరువులో స్త్రీ శక్తి భవన నిర్మాణం ఇంకా పూర్తి కా లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగానే భవనం దర్శనమిస్తోంది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కార్యాలయం లేక సం బంధిత అధికారులు, సిబ్బంది, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐకేపీ, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బంది కోసం స్త్రీశక్తి భవనం కోసం లక్షలాది రూపాయలతో 2013లో భవన నిర్మాణానికి పూనుకున్నారు.  2014 నాటికి 75 శా తం పనులు  చేయగా మిగతా పనులు పూర్తి చేసి భవ నాన్ని అందుబాటులోకి తీసుకురావడంలేదు. దీంతో ఐ కేపీ, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు.  స్ర్తీ శక్తి భవనం పనులు ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధు లు రూ.12 లక్షల అంచనాతో  ప్రారంభించారు. ప్రారంభ దశలో పనులు త్వరగానే జరిగాయి. ఆ తరువాత కాం ట్రాక్టర్‌  లోపం వల్ల పనులు నిలిచిసోయాయి. దీంతో 2016లో అప్పటి మార్కాపురం పీఆర్‌ ఈఈ వెంకటేశ్వరరావు భవనాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్‌, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా భవనం పనులు పూర్తి కాలేదు. ఉన్న తాధికారి ఆదేశాలను కాంట్రాక్ర్‌గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు. 

అప్పట్లో నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు, కాంట్రాక్టర్‌ ఆ విషయాన్నే మర్చిపోయారు. ఎనిమిదేళ్లయినా భవనం పూర్తి చేసేందుకు చొరవచూక పోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీరాజ్‌ అధికారులు ఈ భవనాన్ని పరీశిలించి రెండు నెలల్లో పూర్తి చేయిస్తామని హమీ  ఇచ్చి అప్పుడే ఐదేళ్లు గడిచింది.  లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టినప్పటికీ దాన్ని వినిమోగంలోకి తీసుకురాలేదు.   ప్రస్తుతం వెలుగు కార్యాలయం అద్దె భవనంలోనే సాగుతోంది. అధికారుల తీరుపై ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి స్ర్తీశక్తి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-18T04:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising