ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభం కాకుండానే శిథిలం

ABN, First Publish Date - 2021-06-23T06:51:09+05:30

లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆశ్రమ పాఠశాల అదనపు గదుల సముదాయం ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాని

ఆశ్రమ పాఠశాల సముదాయం

ఏడేళ్ల నుంచి ఇదే తంతు

రూ.కోటి  నిధులు వృథా

పెద్దదోర్నాల, జూన్‌ 22 : లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆశ్రమ పాఠశాల అదనపు గదుల సముదాయం ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరింది. మండలంలోని చింతల గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతోంది. ఇక్కడ చదివేగిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం అదనపు గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. ఆ వెంటనే అధికారులు 2014 జనవరి 31న నాబార్డు నిధులు 95 లక్షల రూపాయల అంచనాతో టెండర్‌ ఖరారు చేశారు. 2015 జనవరి 30 నాటికి నిర్మాణం పూర్తి చేశారు. నేటికీ ఆ సముదాయాన్ని ప్రారంభింఛలేదు. దీంతో కిటికీలు, తలుపులు ఊడిపోయాయి. అపుడు వేసిన తాళం ఇప్పటికీ తీయలేదు. సుమారు కోటి రూపాయలు వృథా అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పాఠశాల అదనపు గదుల సముదాయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించాం

నిర్మించిన అదనపు గదుల సముదాయం నేటికీ వినియోగంలోకి తీసుకురావడంలో వైఫల్యంపై ఐటీడీఏ డీఈ లతను వివరణ కోరగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు. 


Updated Date - 2021-06-23T06:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising