ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావు భయంతో గజ గజ వణికిపోతున్న గ్రామం

ABN, First Publish Date - 2021-12-16T17:23:51+05:30

ఆ గ్రామం చావు భయంతో గజ గజ వణికిపోతోంది. నూనూగు మీసాల యువకుల సయితం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా: ఆ గ్రామం చావు భయంతో గజ గజ వణికిపోతోంది. నూనూగు మీసాల యువకుల సయితం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మృత్యువు ఎప్పుడు కబలిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా, కొమరోలు మండలంలోని మారుమూల ప్రాంతమైన ఓబులాపురం గ్రామంలో మృత్యువు తాండవిస్తోంది. మూడు నెలలుగా జనం పిట్టల్లా రాలిపోతుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 


ఆనందంగా తోటివారితో కలిసి తిరుగుతున్నవారు ఎలాంటి అనారోగ్యం లేకుండానే చనిపోతున్నారు. మూడు నెలలుగా గ్రామంలోని స్థానికులు పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో కొందరు యువకులు కూడా ఉండడంతో స్థానికులను కలచివేస్తోంది. చలాకీగా ఉండే యువకులు సయితం మృతిచెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అసలు తమ గ్రామానికి ఏమైందో.. ఈ పరిస్థితులకు కారణమేంటో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరయితే సప్పలమ్మ అమ్మవారు గ్రామంపై ఆగ్రహంగా ఉందని, ఆమెకు శాంతి పూజలు చేయకపోవడంవల్లే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. పదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ధూప దీపాలు, జంతు బలులతో స్థానికులు అమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత మళ్లీ మూడు నెలల నుంచి అవే పరిస్థితులు తలెత్తినందువల్ల మళ్లీ అమ్మవారికి జాతర చేయాలని సూచిస్తున్నారు.

Updated Date - 2021-12-16T17:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising