ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోఆప్షన్‌ పదవులకు పోటాపోటీ

ABN, First Publish Date - 2021-05-09T06:26:41+05:30

నగర పంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల పదవుల కోసం పలు వురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైనారిటీ కోటా కింద నియమించే ఇద్దరు సభ్యుల విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలనా అనుభవం కోటాలో పలువురి ప్రయత్నాలు 

మూడింటినీ ముస్లిం మైనారిటీలకు ఇచ్చే చాన్స్‌

అద్దంకి, మే 8: నగర పంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల పదవుల కోసం పలు వురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైనారిటీ కోటా కింద నియమించే ఇద్దరు సభ్యుల విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.  మైనారిటీ మహిళా కో టాలో 14వ వార్డు నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓటమి చెందిన షేక్‌ అమి రూన్‌ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మైనారిటీ కోటాలో ఉన్న మరో పదవి కోసం 1వ వార్డులోని దూదేకుల సామాజిక వర్గానికి చెందిన షేక్‌ మస్తాన్‌, 19వ వార్డు మాజీ కౌన్సిలర్‌ షేక్‌ మహబూబ్‌ బాషాలు తీవ్ర ప్రయ త్నాలు చేస్తున్నారు.  మస్తాన్‌కు అవకాశం ఇస్తే, పాలనా అనుభవం కోటాలో మాజీ కౌన్సిలర్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడిగా అనుభవం ఉన్న షేక్‌ మహబూబ్‌ బాషాకు చాన్సు దక్కనుంది. అయితే రెండు పదవులు ముస్లిం మైనారిటీలకు ఇ చ్చి, పాలనా అనుభవం కోటాలో ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తే మాజీ కౌన్సిలర్‌ కొప్పోలు హనుమంతరావు, విశ్రాంత ఎఫ్‌ఐ చలమారెడ్డి  పే ర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వీరితోపాటు వడ్లవల్లి ఆంజనేయు లు, నాగసూరి శ్రీనివాసరావు కూడా పోటీ పడుతున్నారు. కోఆప్షన్‌ పదవులు ఆశి స్తున్న  వ్యక్తులు తమ నాయకులను వెంటబెట్టుకొని నియోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్యను ఒంగోలులో కలిశారు. నామినేషన్‌ల దాఖలుకు సోమవారం తుది గడువు కావటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


Updated Date - 2021-05-09T06:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising