ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2021-01-20T05:42:18+05:30

కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతూన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తీగలేరును చిన్న కండ్లేరుకు అనుసంధానం చేస్తాం

83 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయిస్తాం

వెలిగొండ ద్వారా కరువును తరిమేద్దాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

పుల్లలచెరువు, జనవరి 19: కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అని  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మండల కేంద్రమైన పుల్లలచెరువులో 330 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. మానేపల్లి మల్లాపాలెం గ్రామాల్లో రూ.86 లక్షలతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మఒడి, రైతు భరోసా, చేయూత,  ఆసరా , ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలతో సంక్షేమ ప్రభుత్వంగా మారిందన్నారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువను పుల్లలచెరువు చిన్నకండ్లేరు చెరువుకు అనుసంధానం చేసి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.  వెలుగొండ ప్రాజెక్టు ద్వారా పుల్లలచెరువు చిన్నకండ్లేరుకు అనుసంఽధానం చేసి 11 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగు నీరు, తాగు నీరు అందించి కరువును పారదోలతామన్నారు. తీగలేరు 5 కాలువకు రూ.83 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అధికారులు అవీనీతీకి పాల్పడకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో మార్కపురం ఆర్డీవో శేషారెడ్డి, డీడీవో బీవీఎన్‌ సాయికుమార్‌, తహసీల్దార్‌ చింతలపూడి అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయరత్నం, డీఈ రమణయ్య, ఏఈ నరేంద్రరెడ్డి, కాంట్రాక్టరు వెంకటరెడ్డి, వైసీపీ మండల కన్వీనరు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ ఎం సుబ్బారెడ్డి, మండల నాయకులు యండ్రపల్లి స్వామి, రెంటపల్లి సుబ్బారెడ్డి, యల్లారెడ్డి రోశిరెడ్డి, నాయకులు రఘు, కె వీరయ్య, రాములు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T05:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising