ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోలో పర్సు మర్చిపోవడంపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-05-06T06:45:51+05:30

మండలంలోని రాజుగారిపాలేనికి చెందిన పిలారి గుణ సుందరి ఆటోలో రూ.1,08,000 నగదు కలిగిన పర్సును మర్చిపోగా, వెంటనే పో లీసులు స్పందించి ఆమెకు నగదును అప్పగించారు.

పోలీస్‌స్టేషన్‌లో మహిళకు నగదును అప్పగిస్తున్న ఎస్‌ఐ చౌడయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్టూరు, మే 5 : మండలంలోని రాజుగారిపాలేనికి చెందిన పిలారి గుణ సుందరి ఆటోలో రూ.1,08,000 నగదు కలిగిన పర్సును మర్చిపోగా, వెంటనే పో లీసులు స్పందించి ఆమెకు నగదును అప్పగించారు. ఎస్‌ఐ చౌడయ్య కథనం ప్ర కారం... బుధవారం ఉదయం గుణసుందరి ద్రోణాదులలోని ఏపీజీబీ బ్యాంకులో బంగారం తనఖా పెట్టి 1,08,000 నగదును తీసుకుంది. పర్సులో నగదును ఉం చుకొని రాజుగారిపాలెం మీదుగా మార్టూరు వెళ్లే ఆటో ఎక్కింది. తన గ్రామం రాగానే పర్సు మర్చిపోయి ఆటో నుంచి గుణసుందరి దిగి ఇంటికి వెళ్లింది. పర్సు లేకపోవడంతో ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. ఎస్‌ఐ చౌడయ్య స్పందించి వెంటనే కానిస్టేబుల్‌ కుమార్‌ను ఆటో స్టాండుకు పంపించారు. అప్పటికే ఆటో డ్రైవరు పలతోటి రాజు తన ఆటోలో ప ర్సు మర్చిపోయిన మహిళ గురించి సహచర డ్రైవర్లకు తెలిపాడు. విషయం తె లుసుకున్న కుమార్‌ వెంటనే డ్రైవరు రాజు ఇంటికి వెళ్లి నగదుతో ఉన్న పర్సును స్టేషనుకు తెచ్చారు. ఎస్‌ఐ గుణసుందరిని స్టేషనుకు పిలిపించి నగదును అప్ప చెప్పడంతో కథ సుఖాంతమైంది.


Updated Date - 2021-05-06T06:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising