ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పోలేరమ్మ జాతర

ABN, First Publish Date - 2021-03-29T05:34:28+05:30

మార్కా పురం పట్టణ శివార్లలో వెలసియున్న అల్లూరి పోలేరమ్మకు ఉగాది ముందు నిర్వహించే 5 వారాల జాతర ఆదివా రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ప్రత్యేకాలంకరణలో పోలేరమ్మ అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భక్తి శ్రద్ధలతో పూజలు

పోటెత్తిన భక్తులు

మార్కాపురం, మార్చి 28: మార్కా పురం పట్టణ శివార్లలో వెలసియున్న అల్లూరి పోలేరమ్మకు ఉగాది ముందు నిర్వహించే 5 వారాల జాతర ఆదివా రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పో లేరమ్మ తల్లిని ప్రతి ఏడాది పాల్గుణ మాసం అమావాస్య పాడ్యమి నుంచి చైత్రమాస ప్రారంభం ఉగాది వరకు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. మహిమ గల త ల్లిగా కొలుచుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఈ నెలలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. అల్లూరి పోలేరమ్మకు తరతరాల నుంచి ఉగాది ముందు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, జాతర నిర్వహిస్తారు. 

అర్చకులు ఆవుల వెంకటేశ్వర్లు, పవన్‌ కుమార్‌ శర్మలు పోలేరమ్మ మూల విరాట్‌కు ప్రత్యేక అర్చనలు, పంచామృత అభిషేకాలు నిర్వ హించారు. ఆదివారం తెల్లవారుజాము ముడు గంటల నుంచే భక్తు లు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలలో నిలబడ్డారు. అమ్మవారి ని దర్శించుకొని పూజలు నిర్వహించి పొంగళ్లు వండి నైవేధ్యం సమ ర్పించారు. పసుపు, కుంకుమ, చీరలు, జాకెట్లు సమర్పించారు. కుంకు మ భరణులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. నాగశిలలలకు పూజలు చేసి నాగుల పుట్టలో పాలు పోశారు. ఆలయ ఈవో ఈదుల చెన్న కేశవ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Updated Date - 2021-03-29T05:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising