ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-12-08T04:41:09+05:30

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చునని సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌ అన్నా రు.

వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న సబ్‌కలెక్టర్‌ అపరాజిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌

అంతర్‌ కళాశాల వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

కందుకూరు, డిసెంబరు 7: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చునని సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌ అన్నా రు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్‌ కళాశాల వాలీబాల్‌ పోటీలు మంగళవారం టీఆర్‌ ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. పోటీలను సబ్‌కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. క్రీ డాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిం చి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో భాగంగా సివిల్‌ సర్వీసు, నీట్‌ పరీక్షలకు త గిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. కళాశాల ప్రి న్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రవికుమార్‌ మాట్లాడుతూ యూ నివర్సిటీ అంతర్‌ కళాశాల పోటీలు తమ కళాశాలలో నిర్వహించడం ఆనందంగా ఉం దన్నారు. ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌సన్‌, జాతీయ వాలీబా ల్‌ కోచ్‌ డాక్టర్‌ రమణ, టీఆర్‌ఆర్‌ కళాశాల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ మాల్యాద్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. 

ఈ టోర్నమెంట్‌లో తొమ్మిది జట్లు పా ల్గొంటున్నాయి. తొలిరోజు జరిగిన పోటీల్లో ఏఎన్‌యూ ఆర్ట్స్‌ కళాశాల జట్టుపై టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. జేకేసీ కళాశాల గుంటూరుపై ఏ ఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ కాలేజి, ఆర్‌వీఆర్‌ అండ్‌  జేసీ ఇంజనీరింగ్‌ కాలేజి గుంటూరుపై ధనల క్ష్మీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజి, ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల నాగార్జునసాగర్‌పై యూనివర్సిటీ కాలేజి ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ జట్టు, పీఎంసీ కాలేజీ సింగరాయకొండ జట్టుపై కాగ్దేవి కళాశాల నరసరావుపేట జట్టు విజయం సాధించాయి.


Updated Date - 2021-12-08T04:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising