ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పిరమిడ్‌’ సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2021-03-03T06:51:36+05:30

పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలు అభిందనీయమని నగర పంచాయతీ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు పేర్కొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌, శివోహం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిషనర్‌ నారాయణరావు

కనిగిరి, మార్చి 2: పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలు అభిందనీయమని నగర పంచాయతీ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు పేర్కొన్నారు. పట్టణంలో శివోహం మహాశివరాత్రి ధ్యానోత్సవం సందర్భంగా పిరమిడ్‌ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన వీధుల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్‌ సంస్థ సభ్యులు, మహిళలు పామూరు బస్టాండ్‌ కూడలిలో ప్రభుత్వ ఆసుపత్రి, రోడ్ల వెంట చెత్తా చెదారాలను ఎత్తివేసి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా  కమిషనర్‌  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. పట్టణ సమీపంలోని నందనమారెళ్ల గ్రామంలో కాశీనాయన పిరమిడ్‌ ఆశ్రమం ద్వారా ఈ నెల 11, 12న మహాశివరాత్రి జాగరణ ధ్యానోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని సేవా కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఎస్సై జి రామిరెడ్డి, టీపీఎస్‌ శాంతి, పిరమిడ్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నంద ప్రసాద్‌రావు, కనిగిరి అధ్యక్షులు గుంటూరు రవీంద్ర, నర్సారెడ్డి, పేర్ల రమేష్‌, పేర్ల లక్ష్మి, కనమర్లపూడి లక్ష్మి మోహన్‌, సౌజన్య, గాదంశెట్టి ప్రసాద్‌, శ్రీదేవి, భారతి, రవణమ్మ, వెంకటేశ్వరరెడ్డి, ధ్యానబృందం సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T06:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising