ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి

ABN, First Publish Date - 2021-02-25T04:56:17+05:30

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ అన్నారు. బుధవారం ముండ్లమూరు గ్రామ సర్పంచ్‌గా ఒద్దిపోగు ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారం గ్రామ సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన తరువాత పార్టీలకు అతీతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.

ముండ్లమూరు సర్పంచ్‌ ఒద్దిపోగు ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకార సభలో మాట్లాడుతున్న దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ 

ముండ్లమూరు, ఫిబ్రవరి 24 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ అన్నారు. బుధవారం ముండ్లమూరు గ్రామ సర్పంచ్‌గా ఒద్దిపోగు ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారం గ్రామ సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన తరువాత పార్టీలకు అతీతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ముండ్లమూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కష్టపడిన ఫలితంగానే సర్పంచ్‌ అభ్యర్థి గెలుపొందారన్నారు. అనంతరం ఇన్‌చార్జ్‌ రమే్‌షను గ్రామ టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. నూతన సర్పంచ్‌ ఆదిలక్ష్మి, ఉప సర్పంచ్‌ నారాయణమ్మలను కూడా గ్రామస్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మేదరమెట్ల వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, ఏజేపీ వీరపనేని రంగా, గంగినేని శేషగిరిరావు, రంగ నాయకులు, వీరపనేని బుచ్చిబాబు, బోడపాటి  హనుమంతరావు, ముప్పాళ్ళ కోటేశ్వరరావు, వీరపనేని నాగమల్లి, కంకణాల వెంకటరావు, బత్తిన సురేష్‌, ఒద్దిపోగు గురవయ్య, రమేష్‌, వెంకటేశ్వర్లు, వీర నారాయణ, తాతపూడి తెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T04:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising