ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

ABN, First Publish Date - 2021-11-28T04:17:13+05:30

కరెంట్‌, తాగు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్‌ ప్రజలు గత నాలుగు రోజులుగా కరెంట్‌ సరఫరా లేకపోవడమేకాక పది రోజుల నుంచి నీరు రావడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.

తాగునీటి కోసం బస్సును అడ్డగించిన గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాగుటూరు వాసుల నిరసన

నిలిచిన వాహనరాకపోకలు

కంభం (అర్థవీడు), నవంబరు 27: కరెంట్‌, తాగు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్‌ ప్రజలు గత నాలుగు రోజులుగా  కరెంట్‌ సరఫరా లేకపోవడమేకాక పది రోజుల నుంచి నీరు రావడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. వీరి నిరసనతో అటుగా వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. గంటసేపు జరిగిన రాస్తారోకోతో ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులుగానీ, నాయకులు గానీ ఎవరూ పట్టించుకోకపోవడంపై వారు తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు వచ్చిన కార్యదర్శితో ఆందోళన కారులు వాగ్వివాదానికి దిగారు. గ్రామంలో తాము ఉండాలా,  ఊరు విడిచి పోవాలా అని నిలదీశారు. నాలుగు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేదని, విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.  దీనిపై మీరేమంటారని కార్యదర్శిని ప్రశ్నించారు.  పదిరోజులుగా తాగు నీరు కూడా రావడం లేదన్నారు. తక్షణమే సమస్య లను పరిష్కరించేవరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం తో నిరసన విరమించారు. 


Updated Date - 2021-11-28T04:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising