తగ్గిన జనసంచారం
ABN, First Publish Date - 2021-05-11T05:24:18+05:30
జిల్లాలో జనసంచారం తగ్గింది. ప్రధానంగా పట్టణాల్లో అది స్పష్టంగా కనిపించింది. జిల్లావ్యాప్తంగా ఆరవరోజైన సోమవారం పాకిక్ష లాక్‌డౌన్ సంపూర్ణంగా సాగింది. ఒకవైపు కరోనా ఉధృతితో ప్రజల్లో నెలకొన్న భయం, మరోవైపు పాక్షిక లాక్‌డౌన్ అమలుపై అధికారుల పర్యవేక్షణ గతం కన్నా కాస్తంత మెరుగుపడటమే ఇందుకు కారణం. మధ్యాహ్నం 12గంటల కల్లా పక్కాగా జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. అంతేకాక ప్రజలు కూడా అత్యధికులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
12 గంటలకల్లా పక్కాగా షాపుల మూత
ఆ తర్వాత కర్ఫ్యూ పర్యవేక్షిస్తున్న అధికారులు
సడలింపు వేళ పట్టణాల్లో పోలీస్ పికెట్లు
జిల్లాలో ఆరవరోజు కొనసాగిన పాక్షిక లాక్‌డౌన్
ఒంగోలు, మే 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జనసంచారం తగ్గింది. ప్రధానంగా పట్టణాల్లో అది స్పష్టంగా కనిపించింది. జిల్లావ్యాప్తంగా ఆరవరోజైన సోమవారం పాకిక్ష లాక్‌డౌన్ సంపూర్ణంగా సాగింది. ఒకవైపు కరోనా ఉధృతితో ప్రజల్లో నెలకొన్న భయం, మరోవైపు పాక్షిక లాక్‌డౌన్ అమలుపై అధికారుల పర్యవేక్షణ గతం కన్నా కాస్తంత మెరుగుపడటమే ఇందుకు కారణం. మధ్యాహ్నం 12గంటల కల్లా పక్కాగా జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. అంతేకాక ప్రజలు కూడా అత్యధికులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వివిధ శుభ, అశుభ కార్యక్రమాలపై సైతం నియంత్రణ ఉండటం రాజకీయ ఇతరత్రా కార్యకలాపాలు లేకపోవడంతో కూడా జనం రాకపోకలు తగ్గాయి. ఇక ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నానికల్లా నిలిచిపోవడం, ప్రైవేటు వాహనాలపై అధికారుల నియంత్రణతో పల్లెల నుంచి పట్టణానికి వచ్చే జనం రాకపోకలు మందగించాయి. దీంతో సడలింపు సమయమైన ఉదయం 6 నుంచి 12 గంటల మధ్య కూడా పెద్దగా జనసంచారం గతం కన్నా తగ్గింది. ఒంగోలులోని పలు ప్రధానకూడలి ప్రాంతాల్లో పికెట్లు, మొబైల్ పార్టీలు సడలింపు వేళ అలాగే ఆ తర్వాత కర్ఫ్యూ సమయంలోనూ వీధుల్లో తిరిగి నియంత్రించారు. ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి ఉంది.
Updated Date - 2021-05-11T05:24:18+05:30 IST