పందిరి సాగుకు రైతుల ఆసక్తి
ABN, First Publish Date - 2021-07-18T06:27:16+05:30
ఏటా సాగు చేస్తున్న వాణిజ్య పంటల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి నష్టాలను చవి చూస్తున్న రైతులు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపు తున్నారు.
వరుస నష్టాలతో
ప్రత్యామ్నాయ పంటల వైపు చూపు
కూరగాయల పెంపకానికి సిద్ధం
పెద్ద దోర్నాల, జూలై 17 : ఏటా సాగు చేస్తున్న వాణిజ్య పంటల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి నష్టాలను చవి చూస్తున్న రైతులు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపు తున్నారు. మండలంలోని చిన్నదోర్నాల, తిమ్మాపురం, బొమ్మలాపు రం గ్రామాలలో సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో కూరగాయల సాగును ఎంచుకున్నారు. అయితే ఈ సాగులో సాధారణంగా నేలపై పండే తీగజాతి కూరగాయలు మట్టి, నీటి తేమ సోకి పలు తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో తెగుళ్ల బెడదలేక నాణ్యమైన పంట ఉత్పత్తి నిచ్చే పందిరి సాగుపై దృష్టి సారించారు. దొండ, కాకర, బీర, సొరకాయ వంటి కూరగాయలను నాటి పందిరి పద్ధతిలో పంటలు తీస్తున్నారు. చిన్న సన్న కారు రైతులు వరంలా భావిస్తున్నారు. కూలీలతో పెద్దగా పని లేకుండా భార్యభర్తలు, కుటుంబ సభ్యులకు రోజూ పని లభించడంతో పాటు నికర ఆదాయన్ని పొందవచ్చంటున్నారు. పందిరి సాగుకు మొదట ఖర్చు ఎక్కువే అయినా శాశ్వత పందిరి ద్వారా దిగుబడులు పెరిగి మంచి దిగుబడితో పాటు ఆదాయం పొందవచ్చని ఆదాయాన్ని ఇస్తు న్నాయని రైతులు అంటున్నారు. ఎకరం పొలంలో రాతి స్తంభాలు, ఇనుప తీగ మొత్తం కలిపి రూ.2 లక్షలు అవసరమవు తాయి. గతంలో ప్రభుత్వం పందిరి సాగుకు ఎకరానికి రూ.లక్ష రాయితీ ప్రో త్సాహం అందజేస్తుందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలు నిలిపివేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-07-18T06:27:16+05:30 IST