ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా, పెళ్లికానుకల్లేవ్‌

ABN, First Publish Date - 2021-04-17T05:57:21+05:30

‘బీమా, పెళ్లికానుకల్లేవ్‌.. కనీసం నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించటంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సామాన్యునిపై అధికభారం మోపి సంక్షేమ పఽథకాల పేరుతో మభ్యపెడుతున్నారు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. పర్చూరు మండలం కొల్లావారిపాలెం ఎస్సీకాలనీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయనకు గ్రామంలో పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికాయి. వారినుద్దేశించి లోకేష్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు కనీసం ఉపాధి అవకాశాలు కూడా దొరకటం లేదన్నారు.

కొల్లావారిపాలెంలో మాట్లాడుతున్న నారా లోకేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నారా లోకేష్‌

నిత్యవసరాల ధరలు నియంత్రించటంలో ప్రభుత్వం విఫలం

పర్చూరు, ఏఫ్రిల్‌ 16: ‘బీమా, పెళ్లికానుకల్లేవ్‌.. కనీసం నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించటంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సామాన్యునిపై అధికభారం మోపి సంక్షేమ పఽథకాల పేరుతో మభ్యపెడుతున్నారు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. పర్చూరు మండలం కొల్లావారిపాలెం ఎస్సీకాలనీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయనకు గ్రామంలో పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికాయి. వారినుద్దేశించి లోకేష్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు కనీసం ఉపాధి అవకాశాలు కూడా దొరకటం లేదన్నారు. ఇసుక పసిడి కంటే ఖరీదుగా మారిందని, సిమెంట్‌ కొనే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బస్తా రూ.270 ఉన్న ధర ప్రస్తుతం రూ.400కు చేరటం ఇందుకు నిదర్శనమన్నారు. గ్యాస్‌, పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. గతంలో పండుగ కానుకగా అందే రంజాన్‌ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసుత్తం రాష్ట్రంలో జే ట్యాక్స్‌ నడుస్తోందని, బ్రాండ్లు మార్చి సొంత మద్యం అమ్ముతున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ లోన్లను పేదలకు అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రసుత్తం వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ నిధులను పక్కదారి పట్టించిందన్నారు. విదేశీ విద్య నేడు మిధ్యగా మారిందని, సొంత చెల్లికే న్యాయం చేయలేని వారు రాష్ట్రానికి ఏవిధంగా న్యాయం చేస్తాడని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-04-17T05:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising