ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరసన మంట

ABN, First Publish Date - 2021-01-14T05:50:18+05:30

కేంద్ర, రాష్ట్రప్రభుత్వ విధానాలు, నూతనంగా తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంక్రాంతి పర్వదిన సమయంలో పలు రాజకీయపక్షాలు, రైతు, ప్రజాసంఘాలు నిరసనలు తెలిపాయి.

కనిగిరిలో సాగు చట్టాల జీవో ప్రతులను భోగి మంటల్లో వేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




భోగి మంటల్లో ప్రభుత్వ చట్టాల ప్రతుల దహనం

కేంద్ర, రాష్ట్రప్రభుత్వ విధానాలపై విపక్షాల నిరసన

టీడీపీ, వామపక్షాలు విడివిడిగా కార్యక్రమాలు

ఒంగోలు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్రప్రభుత్వ విధానాలు, నూతనంగా తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంక్రాంతి పర్వదిన సమయంలో పలు రాజకీయపక్షాలు, రైతు, ప్రజాసంఘాలు నిరసనలు తెలిపాయి. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న తీరు, ప్రభుత్వ చట్టాలను నిరసిస్తూ వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆ జీవోల ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టాయి. అదేసమయంలో కేంద్ర నూతన సాగు చట్టాలు, రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆస్తిపన్ను చట్టాలు ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, పలు రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ జీవో99 రద్దుచేయడం, రైతు భరోసాలో కౌలు రైతులకు అన్యాయం జరిగేలా తెచ్చిన జీవో96, జీవో 417, విద్యుత్‌ మీటర్ల కోసం తెచ్చిన జీవో 22, సున్నావడ్డీ పరిమితి తగ్గిస్తూ తెచ్చిన జీవో 464 తదితర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు వాటి ప్రతులను తగులబెట్టారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కామేపల్లి శ్రీనివాసరావు, పమిడి రమేష్‌, కొఠారి నాగేశ్వరరావు, రావుల పద్మజ, కె. కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.  గిద్దలూరులో జరిగిన కార్యక్రమంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి పాల్గొనగా దర్శి, కనిగిరి, యర్రగొండపాలెంలో టీడీపీ శ్రేణులు నిరసనలు తెలిపాయి. మరోవైపు ఒంగోలులోని మంగమూరు రోడ్డు బైపాస్‌కూడలి వద్ద సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, ముఖ్యనేతలు షేక్‌ మాబు, జీవీ కొండారెడ్డి, కె.ఆంజనేయులు పాల్గొన్నారు. ఆస్తిపన్ను చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం సెంటర్‌, సీపీఐ ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండు వద్ద ప్రతులను దహనం చేశారు. అలాగే కొండపి, కందుకూరు, పామూరు, టంగుటూరు, పొదిలి, చీమకుర్తి, మార్కాపురం, కనిగిరి, వైపాలెం, పుల్లలచెరువు, చీరాల, అద్దంకి, చీమకుర్తి, త్రిపురాంతకం, పొన్నలూరు, వీవీపాలెంలతోపాటు పలు గ్రామాల్లోనూ వామపక్ష రైతుసంఘాలు, కార్మిక ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. 


Updated Date - 2021-01-14T05:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising