ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN, First Publish Date - 2021-08-03T07:43:02+05:30

పాఠశాల పారిశుధ్య కార్మికులకు (ఆయాలు) ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలని ఏఐటీయూసీ నాయకులు యాసిన్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, ఆగస్టు 2: పాఠశాల పారిశుధ్య కార్మికులకు (ఆయాలు) ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలని ఏఐటీయూసీ నాయకులు యాసిన్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక దర్శి చెంచయ్య భవనంలో కనిగిరి, హెచ్‌ఎంపాడు మండలాలకు చెందిన పాఠశాల పారిశుద్య కార్మికుల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆయాలపై రాజకీయ వేధింపులు లేకుండా యూనియన్‌ అండగా నిలబడుతుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వేతనాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు ఆయాలపై కక్షసాధింపు చర్యలు చేస్తూ పలు రకాల ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, సీపీఐ నాయకులు జీపీ రామారావు, సునీత, పాపులమ్మ, సమాధానం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T07:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising