ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15న నాగభైరవ జాతీయ పురస్కారాలు

ABN, First Publish Date - 2021-08-02T05:11:50+05:30

సాహిత్యం, నాటక రంగాల్లో విశేష కృషి చే స్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తె లిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కల్చరల్‌), ఆగస్టు 1: సాహిత్యం, నాటక రంగాల్లో విశేష కృషి చే స్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తె లిపారు. ఈనెల 15వ తేదీన ఒంగోలులో జరిగే సభలో పురస్కారాల ప్రదానం చేస్తామన్నారు. నవలల పోటీలో హైదరాబాద్‌కు చెందిన సలీం రచించిన ‘ఎడా రిపూలు’ ప్రథమ బహుమతికి, మంధనికి చెందిన చేతన వంశీ రచించిన ‘కోటి కొక్కడు’ ద్వితీయ బహుమతికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. పరిశోధనల పోటీలో కడపకు చెందిన అనుపాటి సుబ్బారాయుడు ‘గాధాసప్తశతి సౌందర్యగాథ’, కోట కు చెందిన డాక్టర్‌ పెళ్లూరు సునీల్‌ ‘దీర్ఘకవితావికాసం’ ప్రథమ, ద్వితీయ బహు మతులకు ఎంపిక చేశామన్నారు.  వీరికి సాహిత్య పురస్కారంతో పాటు రూ.10 వేలు, రూ.5వేలు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ఇక కొత్తగా ప్ర వేశపెట్టిన నాగభైరవ నాటక పురస్కారానికి గుంటూరుకు చెందిన జరుగుల రా మారావును, నాగభైరవ ఆత్మీయ పురస్కారానికి నెల్లూరుకు చెందిన చిన్ని నారా యణరావును ఎంపిక చేసినట్లు ఆదినారాయణ వెల్లడించారు.


Updated Date - 2021-08-02T05:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising