కష్టకాలంలో ఐక్యంగా ఉందాం
ABN, First Publish Date - 2021-08-08T06:56:11+05:30
నియోజకర్గంలోని టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చిన అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం అన్నారు.
అధిష్టానం ఎవరిని ఇన్‌చార్జ్‌గా నియమించినా సహకరిద్దాం
కార్యకర్తలకు అండగా నిలుస్తా..
ఉలవపాడు, ఆగస్టు 7 : నియోజకర్గంలోని టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చిన అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం అన్నారు. మండలకేంద్రం ఉలవపాడులో శనివారం టీడీపీ సర్వసభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాం మాట్లాడుతూ.. కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా అధిష్టానం ఎవరిని నియమించిన అందరం కలిసి కట్టుగా పార్టీకి పనిచేయాలన్నారు. తనకు ఇన్‌చార్జ్ పదవిమీద ఎలాంటి ఆశలు లేవని తేల్చి చెప్పారు. అయితే పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చిన తనవంతుగా అండగా నిలుస్తానన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిత్యవసర వస్తువుల ధరలు, ఇసుక కేటాయింపు వంటి అంశాలపై తహసీల్దార్ కే.సంజీవరావుకు వినతిపత్రం అందించారు. అదేవిధంగా పెదపట్టపుపాలెం టీడీపీ కార్యకర్తలను కేసుల పేరుతో వేధించడం ఆపాలని ఎస్సై విశ్వనాథరెడ్డితో మాట్లాడారు. సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గోచిపాతుల మోషే, కార్యనిర్వాహక కార్యదర్శి అమ్మనబ్రోలు రమేష్, ఆత్మకూరు సర్పంచ్ నాళం గోవిందమ్మ, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీను, టీడీపీ నాయకులు నాదెళ్ల వెంకట సుబ్బారావు, దామా మల్లేశ్వరరావు, బెజవాడ ప్రసాదు, సుబ్బారావు, చిలకపాటి మధు, మర్రిబోయిన శ్రీహరి, రాచగల్లు శివ, గడ్డం నవీన్, ఆర్ రమేష్, తదితరలు పాల్గొన్నారు.
గుడ్లూరు : టీడీపీ ఎదుగుదలకు నేడు కృషి చేస్తేనే రేపటికి భవిష్యత్తు ఉంటుందని కందుకూరు మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దివి శివరాం అన్నారు. మండల కేంద్రమైన గుడ్లూరు ఎన్టీఆర్‌ట్రస్టు భవన్‌వద్ద శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడ్లూరు మండల కార్యకర్తలు, నాయకులు పార్టీ అధికారంలో లేదని అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు తగు భరోసా కల్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజునుంచి, తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, వారిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఏదిఏమైనప్పటికి పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు సహకరించి ముందుకుపోవాలన్నారు. గ్రామస్ధాయిలో పార్టీ సాధారణ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, గ్రామ,మండల కమిటీలు వెంటనే స్పందించాలన్నారు. అలాగే ఇటీవల కొత్తపేటలో వైస్‌ప్రెసిడెంట్ బంకా శ్రీనుపై పోలీసుల తీరును బాధితులు శివరాం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదరు సమస్యపై పోలీసుల ద్వారా ఆరా తీయించారు. నిష్పపక్షపాతంలో పోలీసులు వ్యవహరించాలని కోరారు. అలాగే చినపవని ఎస్సీ కాలనీలో గతంలో ఇరువర్గాల మద్య జరిగిన కొట్లాట కేసులో గాయపడ్డ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, మాజీ ఉపాధ్యక్షులు నాదేళ్ల వెంకటసుబ్బారావు, మహాదేవపురం సోసైటీ మాజీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గుడ్లూరు మండల నాయకులు మేకపోతులు రాఘవులు, చెన్నారెడ్డి మహేష్, పువ్వాడి వేణు, మాలకొండారెడ్డి, చిత్తారి మల్లికార్జున, మద్దసాని కృష్ణ, ప్రసాదు, చిలకపాటి మధు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-08T06:56:11+05:30 IST