ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ముంచిన మైక్రో కంపెనీ

ABN, First Publish Date - 2021-05-06T06:24:48+05:30

అధిక దిగుబడులు వస్తాయి, మద్దతు ధర చెల్లిస్తాం అం టూ నమ్మబలికి తమను నట్టేట ముంచింద ని గడికోట గ్రామానికి చెందిన రైతులు మె ౖక్రో సీడ్స్‌ కంపెనీపై ధ్వజమెత్తారు. ఈ మే రకు రైతులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చర్యలు తీసుకోవాలని ఆందోళన 

గిద్దలూరు టౌన్‌, మే5 : అధిక దిగుబడులు వస్తాయి, మద్దతు ధర చెల్లిస్తాం అం టూ నమ్మబలికి తమను నట్టేట ముంచింద ని గడికోట గ్రామానికి చెందిన రైతులు మె ౖక్రో సీడ్స్‌ కంపెనీపై ధ్వజమెత్తారు. ఈ మే రకు రైతులు ఆందోళనకు దిగారు. గడికోట గ్రామానికి చెందిన సింగం నడిపి ఖాదర్‌రెడ్డి, పెద్ద పాండురంగారెడ్డి, ఓబులేసు, రా జు, రంగారెడ్డి, కాశయ్య, రమణయ్య అనే రైతులు మైక్రో కంపెనీకి చెందిన సొద్ద విత్తనాలను తీసుకుని పంట సాగు చేశారు. సు మారు 20 ఎకరాలకు పైగా సాగు చేశారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది, క్వింటా 3500 చొప్పున తామే చెల్లిస్తామని మొదట కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. దీంతో ఎంతో ఆశతో నమ్మి రైతులు సాగు చేయగా దిగుబడి రాలేదు. కేవలం ఎకరాకు 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు అందుబాటులో లేకుండా కంపెనీ నుంచి ఓ వ్యక్తిని పంపించారు. ఆ వచ్చిన వ్యక్తి రైతుల వద్ద  నుంచి పంటను కొనుగోలు చేసి లారీలో లోడు ఎక్కించాడు.   పండించిన పంటకు మాత్రమే డబ్బులు ఇస్తామని, మిగతా నష్టపరిహారం ఇవ్వమని వచ్చిన వ్యక్తి చెప్పాడు. దీంతో  రైతులు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే లారీని కదలనివ్వకుండా అడ్డుకున్నారు. మొదట చెప్పిన విధంగానే డబ్బు చెల్లించాలని, లేనిపక్షంలో పంట ఇవ్వమని భీష్మించారు.  మైక్రో ప్రతినిధులు రాకపోగా వ్యక్తిని పంపి ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటున్నారు. రైతులను మోసగించిన మైక్రో కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2021-05-06T06:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising