ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాల్లో మిరప రైతు

ABN, First Publish Date - 2021-04-11T06:30:59+05:30

మిర్చి రైతులకు ఈ ఏడాది నష్టాల ఘాటు తప్పని పరిస్థితి ఉంది. దిగుబడి తగ్గడం, ధరలు పడిపోవడంతో మిర్చి సాగు చేసిన రైతులు దిగాలవుతున్నారు.

తాలుకాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పీసీపల్లి, ఏప్రిల్‌ 10: మిర్చి రైతులకు ఈ ఏడాది నష్టాల ఘాటు తప్పని పరిస్థితి ఉంది. దిగుబడి తగ్గడం, ధరలు పడిపోవడంతో మిర్చి సాగు చేసిన రైతులు దిగాలవుతున్నారు.

గత ఏడాది మార్కెట్‌లో మిర్చికిమంచి గిరాకీ ఉంది. క్వింటాకు రూ.15 వేలకు పైగా ధర పలికింది. ఏసీలో ఉన్న కాయలు రూ. 17 వేల ధర వద్ద అమ్ముకున్నారు. దీంతో ఈ ఏడాది మిరప సాగు పెరిగింది. మండలంలో తలకొండపాడు, పెద్దన్నపల్లి, కమ్మవారిపల్లి, పీసీపల్లి, వెంగళాయపల్లి, వేపగుంపల్లి తదితర గ్రామ రైతులు అధికంగా మిర్చి పంట పంటను సాగు చేశారు. కాపు దశలోనే తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి చాలా తక్కువ వచ్చింది. దీనికి తోడు మార్కెట్‌ కూడా వారం వారం క్షీణిస్తూ వచ్చింది. ప్రస్తుతం మేలురకం మిర్చి క్వింటా రూ. 12 వేలు మాత్రమే పలుకుతోంది. దిగుబడిలోనూ సగానికి పైగా తాలుకాయలు వచ్చాయి. మార్కెట్‌లో ధరలు తగ్గిపోయాయి. దీంతో నష్టాలు తప్పవని మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరాకు రూ. లక్ష నుంచి రూ.లక్ష ముప్పై వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కొంత మంది రైతులు అప్పు చేసి మరీ మిరప పంట సాగు చేశారు. మార్కెట్‌ ధరలు క్షీణించడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు పంటలు పరిశీలించి  మిరపకు భీమా వచ్చేలా చర్యలు చేపట్టాలని మిరప రైతులు కోరుతున్నారు. బీమాను వర్తింపజేయాలి

నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేశాను. కోత దశలో మిరపకు తెగుళ్లు చుట్టుమిట్టాయి. దీంతో దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు మార్కెట్‌ ధర కూడా వారం వారం క్షీణిస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం మిర్చి అమ్మితే పెట్టిన పెట్టుబడులు కూడా రావు. భారీగా నష్టపోతాం. ఉధ్యానశాఖ అధికారులు పరిశీలించి మిరపక బీమా వర్తింపజేయాలి.

వెలిది శ్రీనివాసులు రైతు, కమ్మవారిపల్లి 

Updated Date - 2021-04-11T06:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising