ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కుల కోసం విద్యార్థులు నడుం బిగించాలి

ABN, First Publish Date - 2021-11-28T05:24:03+05:30

విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం విద్యార్థులు నడుం బిగించాలని ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ మాజీ కార్యదర్శి జీ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో శనివారం ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా నిర్మాణ మహాసభకు అధ్యక్షుడు సీహెచ్‌ లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంతో పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ఉందన్నారు.

మహాసభలో మాట్లాడుతున్న ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ మాజీ కార్యదర్శి ఈశ్వరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా నిర్మాణ సభలో జాతీయ మాజీ కార్యదర్శి ఈశ్వరయ్య

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 27 : విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం విద్యార్థులు నడుం బిగించాలని ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ మాజీ కార్యదర్శి జీ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో శనివారం ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా నిర్మాణ మహాసభకు అధ్యక్షుడు సీహెచ్‌ లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంతో పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను  విద్యకు దూరం చేసే విధంగా ఉందన్నారు. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా నినాదాలతో నూతన కంపెనీలు తీసుకువస్తున్న మోదీ ప్రస్తుతం లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ, రైల్వే, ఎయిర్‌పోర్టు, బీఎ్‌సఎన్‌ఎల్‌, విశాఖ ఉక్కులను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు అచ్చేదిన్‌ ఆయేగా అని చెప్పిన పీఎం పెట్రోలు, డీజల్‌ నిత్యావసర వస్తువుల ధరలుపెంచి ప్రజలకు చచ్చే దినాలు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు తెచ్చిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్శిటీకి అధిక నిధులు కేటాయించి ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని  డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజనచట్టంలో పేర్కొన్న రామాయపట్నం పోర్టును పూర్తిచేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ మాట్లాడుతూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలు రూపుమాపేందుకు విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, పవన్‌ కల్యాణ్‌, సుమంత్‌, బ్రాహ్మణి శ్రీరామ్‌, అజయ్‌, అర్జున్‌, వంశీ, కిరణ్‌, గోపాలకృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-11-28T05:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising