చీమకుర్తికి ‘మాస్టర్‌ప్లాన్’ సిద్ధం !
ABN, First Publish Date - 2021-07-31T05:32:33+05:30
ఇరుకైన అంతర్గత రహదారు లు, అడ్డదిడ్డంగా ఉండే గృహాలు, జనసమూహాల నడుమ ఫ్యాక్టరీలు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ.. ఇదీ ప్రస్తుతం మనకు కనిపించే గెలాక్సీపురంగా ప్రసిద్ధి గాంచిన చీ మకుర్తి పట్టణ ముఖచిత్రం..! ఇకపై పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు ప్రణాళికాబద్దంగా లేని ప ట్టణానికి తొలి మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుంది.
ఐదు జోన్లుగా పట్టణం విభజన
28.45చ.కి.మీ నుంచి 45.65 చ.కి.మీ వరకు విస్తరణ
కొత్తగా ఉత్తరం వైపు నుంచి ఔటర్ రింగ్‌రోడ్ ప్రతిపాదన
మారనున్న గెలాక్సీపురం ముఖచిత్రం
2 నెలల పాటు ప్రజాభిప్రాయం సేకరణ
చీమకుర్తి, జూలై 30 : ఇరుకైన అంతర్గత రహదారు లు, అడ్డదిడ్డంగా ఉండే గృహాలు, జనసమూహాల నడుమ ఫ్యాక్టరీలు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ.. ఇదీ ప్రస్తుతం మనకు కనిపించే గెలాక్సీపురంగా ప్రసిద్ధి గాంచిన చీ మకుర్తి పట్టణ ముఖచిత్రం..! ఇకపై పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు ప్రణాళికాబద్దంగా లేని ప ట్టణానికి తొలి మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుంది. రాబోయే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని పట్టణ అవరసరాలకు స రిపడే విధంగా దాదాపు రెండేళ్లు కష్టపడి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ప్రధానంగా విశాలమైన కనెక్టివిటీ రోడ్లు, పచ్చద నం-పరిశుభ్రత ఉట్టిపడేలా పార్కులు, గ్రీనరీ పెంచటం, పెరుగుతున్న జనావాసాలకు పద్ధతైన అమరిక, కాలుష్య రహితంగా ఉంచేందుకు పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఉంచడం, పట్టణానికి కొత్తగా ఉత్తరం వైపు ఔటర్‌రింగ్‌రోడ్ ఏర్పాటు.. తదితర అంశాలు మాస్టరప్లాన్ లో ఉన్నాయి. నోయిడాకు చెందిన మాస్టర్‌ప్లాన్ రూపకర్త రుద్రాభిషేక్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి చీమకుర్తి పట్టణానికి మాస్టర్ ప్టాన్‌ను రూపొందించారు. శుక్రవారం ప్లాన్ రూపశిల్పి దినేష్‌చం ద్ర స్తానిక నగర పంచాయతీ కార్యాలయంలో పాలకవ ర్గంకు మాస్టర్‌ప్లాన్ ముసాయిదా గురించి వివరించారు. రాబోయే రెండు నెలలపాటు మాస్టర్‌ప్లాన్‌ను ప్రజల ము ందుంచి వారి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని తు ది ప్లాన్‌ను సదరు సంస్థ అందించనుంది. ఒకసారి మా స్టర్ ప్లాన్ ప్రభుత్వ ఆమోదానికి నోచుకుంటే మరో ఇరవై ఏళ్ల పాటు మార్పులు, చేర్పులు చేయడానికి వీలు లేకపో వటం గమనార్హం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై అవకాశం ఉన్నప్పుడే పట్టణవాసులు స్ప ందించి పట్టణాన్ని సుందరంగంగా తీర్చిదిద్దే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రూపశిల్పి కౌన్సిల్‌కు సూచించారు.
మాస్టర్‌ప్లాన్‌లో మౌళిక అంశాలివే....
ప్రస్తుతం చీమకుర్తి విస్తీర్ణం 28.45చ.కీ.మీ కాగా రాబోయే ఇరవై ఏళ్లను దృష్టిలో పెట్టుకొని 2021-41 మా స్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. దీనిప్రకారం 45.65634చ.కి. మీ మేర పట్టణం విస్తరించనుంది. పట్టణాన్ని ఐదు జో న్లుగా విభజించారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీ, ప్రభుత్వ సెక్టార్, గ్రీన్ ఏరియా(అగ్రికల్చర్)లుగా విభజిం చారు. ఉత్తరం వైపుగా ఔటర్‌రింగ్‌రోడ్‌ని ప్రతిపాదించా రు. బీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురు వైపు నుంచి హరిహరక్షేత్రం ముందువైపుగా చినరాస్తారోడ్, నా యుడుపాలెం రహదారి మీదుగా గరికమెట్ల వరకు ఈ పట్టణానికి ఆవలగా ఉత్తరం వైపుగా రహదారిని నిర్మిం చాలని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. లింక్‌రోడ్లు అన్నింటి నీ 40అడుగులకు తగ్గకుండా నిర్మించనున్నారు. పట్టణా నికి మధ్యగా వెళ్తున్న కర్నూల్‌రోడ్డును కనీసం 100 అడు గుల మేర విస్తరించనున్నారు. ఇండ్రస్ట్రీ జోన్‌ని పట్టణాని కి నైరుతి మూలలో చేర్చారు. భవిష్యత్తులో పట్టణం తూ ర్పు, ఉత్తరం వైపు విస్తరించేలా రూపొందించారు. దక్షిణం వైపున ఉన్న ప్రస్తుత బైపాస్‌కి ఇరువైపులా రింగ్‌రోడ్ లో పల జనావాసాలకు చోటు కల్పించారు. మధ్యలో గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చారు. రింగ్‌రోడ్‌కి ఆవల వైపు వ్యవసాయ జోన్‌గా తీర్చిదిద్దారు. మొత్తం మీద మాస్టర్‌ప్లాన్‌ని పరి శీలిస్తే పట్టణం రాబోయే కాలంలో ఆగ్నేయం, ఈశాన్యం వైపు విస్తరించనుంది.
ప్రజాభిప్రాయం కోరతాం
నూతంనంగా రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రజలు ముందుంచి వారి అభిప్రాయాలు కోరతాం. వారి మనోభావాలకు అనుగుణంగా మా ర్పులు చేసి తుది ప్లాన్‌ను తయారు చేయటం జరుగుతుంది. ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత మార్పులు, చేర్పులకు వీలులేదన్న విషయాన్ని పట్టణవా సులు గుర్తించాలి. అందువల్ల పట్టణాన్ని సుందరంగంగా తీర్చిదిద్దటానికి సహకరించాలని కోరుతున్నాం.
- సాంబశివరావు, టీపీఎస్, చీమకుర్తి
Updated Date - 2021-07-31T05:32:33+05:30 IST