ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ కొనుగోలు వ్యవహారంలో వివాదం

ABN, First Publish Date - 2021-06-24T05:38:57+05:30

లారీ కొనుగోలు విషయం లో వివాదం నెలకొంది. దళారీగా ఉన్న వ్యక్తిని కొ నుగోలుకు అడ్వాన్స్‌ ఇచ్చిన వ్యక్తి విద్యుత్‌ స్తంభానికి కట్టివేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అ ద్దంకి స్టేషన్‌లో కేసు నమోదైంది.

స్తంభానికి కట్టివేసి ఉన్న శ్రీరామిరెడ్డి, ప్రశ్నిస్తున్న షేక్‌ సుభాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దళారీని విద్యుత్‌ స్తంభానికి కట్టివేసిన కొనుగోలుదారుడు

కేసు నమోదు చేసిన పోలీసులు



అద్దంకి, జూన్‌ 23 : లారీ కొనుగోలు విషయం లో వివాదం నెలకొంది. దళారీగా ఉన్న వ్యక్తిని కొ నుగోలుకు అడ్వాన్స్‌ ఇచ్చిన వ్యక్తి విద్యుత్‌ స్తంభానికి కట్టివేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అ ద్దంకి స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథ నం మేరకు బల్లికురవ మండలం వి.కొప్పెరపా డుకు చెందిన షేక్‌ సుభానీ అద్దంకిలో ఉంటు న్నాడు. ఆయన లారీ కొనుగోలు చేసేందుకు రెం డు రోజులక్రితం దళారీ అయిన గానుగపెంట శ్రీ రామిరెడ్డిని సంప్రదించాడు. పట్టణానికి చెందిన బిరుదురాజ సంజీవన్‌రాజ్‌కు చెందిన లారీని రూ.8.5 లక్షలకు కొనుగోలు చేసి అడ్వాన్స్‌గా రూ. 80వేలు ఇచ్చారు. 22వ తేదీకి లారీని అప్పగించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే లారీని ఫైనాన్స్‌లో పెట్టి ఉండటంతో గడువులోపు అప్పగించలేమని చెప్పేందుకు బుధవారం పట్ట ణంలోని బంగ్లా రోడ్డులో ఉన్న సుభానీ వద్దకు శ్రీ రామిరెడ్డి, సంజీవన్‌రాజు వచ్చారు. రెండు రోజుల్లో లారీ అప్పగిస్తామని చెప్పారు. దీంతో వివా దం చెలరేగింది. శ్రీరామిరెడ్డి అక్కడి నుంచి వెళ్లేం దుకు ప్రయత్నిస్తుండగా సుభానీ  అడ్డుకొని వి ద్యుత్‌ స్తంభానికి కట్టివేసి కొట్టి బెదిరించాడు. వి షయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొ ని శ్రీరామిరెడ్డిని  విడిపించారు. అతని ఫిర్యాదుమేరకు సుభానీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. 


Updated Date - 2021-06-24T05:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising