ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కేంద్రానికి తాళం

ABN, First Publish Date - 2021-12-02T07:24:57+05:30

అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించి రెండేళ్లయినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ఆ భవనానికి కాంట్రాక్టర్‌ తాళం వేసిన సంఘటన కొమరోలు మండలం నల్లగుంట్లలో బుధవారం జరిగింది.

అంగన్‌వాడీ భవనానికి వేసిన తాళం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిల్లులు చెల్లించకపోవడంపై నల్లగుంట్లలో కాంట్రాక్టర్‌ ఆక్రోశం 

కొమరోలు, డిసెంబరు 1 : అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించి రెండేళ్లయినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ఆ భవనానికి కాంట్రాక్టర్‌ తాళం వేసిన సంఘటన కొమరోలు మండలం నల్లగుంట్లలో బుధవారం జరిగింది. కాంట్రాక్టర్‌ వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సుమారు  రూ.8లక్షలతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో రెండు భవనాలను నిర్మించారు. తొలివిడత బిల్లు వచ్చింది. రెండో విడత బిల్లు ఒక్కో భవనానికి రూ.2.5లక్షలు ప్రకారం రూ.5లక్షలు బిల్లులు నేటికీ రాలేదు. దీంతో నిర్మాణం కోసం చేసిన అప్పుల వారి నుంచి కాంట్రాక్టర్‌పై ఒత్తిడి వచ్చింది. బిల్లుల కోసం అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో భవనానికి తాళం వేశాడు. అంగన్‌వాడీ సిబ్బంది ప్రాథేయపడ టంతో తాళం తీశాడు. ఇలాగే మండలంలోని పోసుపల్లి, కోమరోలులో 3, తాటిచెర్ల, దద్దవాడ, గుండ్రెడ్డిపల్లి, రెడ్డిచెర్ల గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన భవనాలకు చాలావరకు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కొద్దిరోజులు చూసి తామూ నల్లగుంట్ల బాటే పడతామని కాంట్రాక్టర్లు అంటున్నారు. 


Updated Date - 2021-12-02T07:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising