ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలో భాగస్వాములవుదాం

ABN, First Publish Date - 2021-10-18T06:13:32+05:30

కనిగిరి ప్రాంత అభివృద్ధిలో తమవంతు భాగస్వాములం కావాలని రాజమండ్రి జైళ్లశాఖ ఎస్పీ శ్రీరామ్‌ రాజారావు అన్నారు.

సమావేశమైన పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి జైళ్ల శాఖ ఎస్‌పీ శ్రీరామ్‌రాజారావు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కనిగిరి, అక్టోబరు 17: కనిగిరి ప్రాంత అభివృద్ధిలో తమవంతు భాగస్వాములం  కావాలని రాజమండ్రి జైళ్లశాఖ ఎస్పీ శ్రీరామ్‌ రాజారావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్‌, జూనియర్‌ కళాశాలలో 1980-81 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ శ్రీరాం రాజారావు మాట్లాడుతూ... తనతో పాటు చదువుకున్న వారిలో కొంతమంది ప్రభుత్య, ప్రైవేటు ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా స్ధిరపడడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడెక్కడో స్ధిరపడిన వారందరిని ఒక్కచోటకి కలిపేలా కృషి చేసిన స్నేహితులకు అభినందనలు తెలిపారు.  తాము చదువుకున్న కాలంలో ఆటలతో కూడిన విద్య, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, కఠినమైన నియమాలు తమను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడ్డాయన్నారు. ఈ సందర్భంగా భాగంగా నాటి విద్యార్థులందరూ కలిసి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తమ బ్యాచులో ఎవరైన ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారికి అండగా నిలవాలని తీర్మానించారు. ఈ అభిప్రాయంపై కార్యక్రమానికి హజరైన మిత్రులందరూ స్పందించారు. ఒక్కటై నిలిచి దాదాపు రూ. 1.5 లక్షల రూపాయల వరకు సమకూర్చేలా నిర్ణయించుకున్నారు. ఆనగదుతో సేవా కార్యక్రమాలు నిర్వహించి కనిగిరి ప్రాంతాభివృద్దిలో, సేవా కార్యక్రమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని అభిలషించారు. అనంతరం  శ్రీరామ్‌ రాజారావును మిత్రులందరు కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 1980-81 నాటి 10వ తరగతి విద్యార్థుల బృందంలో కనిగిరి పశుసంవర్థకశాఖ ఏడీఏ సత్యనారాయణ, గుంటూరి ప్రసాదరావు, మంచికంటి అనంత, ఒలేటి ప్రసాదరావు, ఎల్‌వీఆర్‌, వెంకటయ్య, రాజారావు, ఆర్‌ఎంపీ మాలకొండయ్య, ఉప్పాల నరసింహం, సాధు నరసింహారావు, జల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T06:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising