ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి

ABN, First Publish Date - 2021-10-29T06:06:19+05:30

భూమిలో సారవంతను పెంపొందించేందుకు సేంద్రియ ఎరువుల వాడకం మేలని ఒంగోలు రైతు శిక్షణ కేంద్రం పీడీఏ సత్తార్‌ అన్నారు.

మాట్లాడుతున్న పీడీఏ సత్తార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 28 : భూమిలో సారవంతను పెంపొందించేందుకు సేంద్రియ ఎరువుల వాడకం మేలని ఒంగోలు రైతు శిక్షణ కేంద్రం పీడీఏ సత్తార్‌ అన్నారు. గురువారం భూమి పోషణ యాజమాన్యం గురించి స్థానిక  ఎంపీడీవో కార్యాలయంలోబీఏఏ, బీహచ్‌ఏ, బీఎస్‌ఏలకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సత్తార్‌ మాట్లాడుతూ రైతులు పండించే నేలను ఎలా సంరక్షించుకోవాలి అనే అంశంపై  వివరిం చారు. భూములలో సారవంతాన్ని పెంచుకోవాలంటే పచ్చిరొట్ట పైరు సాగును చేయాలని సూచించారు. కార్యక్రమంలో గిద్దలూరు సహాయ వ్యవసాయ సం చాలకులు బాలాజీనాయక్‌ మాట్లాడుతూ నేలలో పో షక విలువలు భూసార పరీక్షల ద్వారా గుర్తించి వాటి ఆధారంగా ఎరువులను వాడాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయం వైపు మొగ్గు చూపాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖాధికారి సురేష్‌కుమార్‌, సబ్‌డివిజన్‌ వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 

పురుగు మందుల వాడకం తగ్గించాలి 

 ఎర్రగొండపాలెం : రైతులు పైర్ల సాగులో రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గించాలని ఏడీఏ సుదర్శన్‌రాజు అన్నారు. గురువారం మండలంలోని గంజివారిపల్లె  గ్రామంలో పొలంబడి  కా ర్యక్రమం నిర్వహించారు. పైర్లు సాగు సమయంలో, పంటకు వచ్చే సమయంలో పొలంలో శుత్రు పురుగులను నివారించుకొని, మిత్ర పురుగులను కాపాడుకుంటే పైరు ఎదుగులకు దోహదపడతాయని అ న్నారు. ఈ పొలంబడిలో ఏవో పి  వెంకటేశ్వర్లు, స ర్పంచి డి సుబ్బారెడ్డి, రైతులు పాల్గొన్నారు. రైతులకు పైర్లసాగులో వచ్చే చీడపీడల నివారణపై అవగాహనకల్పించారు.


Updated Date - 2021-10-29T06:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising