ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరాకు రూ. లక్ష నష్టపరిహారం అందించాలి

ABN, First Publish Date - 2021-11-26T05:27:58+05:30

ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్రప్రభుత్వం ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని నక్కబొక్కలపాడులో దెబ్బతిన్న పత్తి, మిర్చిపైర్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలుగా కురిసిన భారీవర్షాలకు పత్తి, జూట్‌, మినుము, ఉల్లి, వరి, కూరగాయల పైర్లు సాగుచేసిన వారికి నష్టాలు వచ్చాయన్నారు.

నక్కబొక్కలపాడులో భారీ వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న మిర్చి పైరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రవికుమార్‌ డిమాండ్‌

నక్కబొక్కలపాడులో దెబ్బతిన్న పైర్ల పరిశీలన 

బల్లికురవ, నవంబరు 25 : ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్రప్రభుత్వం ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని నక్కబొక్కలపాడులో దెబ్బతిన్న పత్తి, మిర్చిపైర్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలుగా కురిసిన భారీవర్షాలకు పత్తి, జూట్‌, మినుము, ఉల్లి, వరి, కూరగాయల పైర్లు సాగుచేసిన వారికి నష్టాలు వచ్చాయన్నారు. పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే దశలో రైతులకు వర్షం రూపంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతో కుదేలయ్యారని పేర్కొన్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ ఏడీతో ఎమ్మెల్యే ఫోనులో మాట్లాడుతూ దెబ్బతిన్న చేల వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని కోరారు. అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులందరూ పంట నష్టం జాబితాలలో పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండలాధ్యక్షుడు కొండేటి ఇజ్రాయల్‌, మలినేని గోవిందరావు, దూళిపాళ్ల హనుమంతరావు, అమరనేని కాశీవిశ్వనాథం, గొట్టిపాటి శంకర్‌, పూర్ణయ్య, వీరాంజనేయులు, లక్ష్మయ్య, ఏడుకొండలు, ఉమామహేశ్వరరావు, దద్దాల అంజయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T05:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising