ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-04-18T06:00:32+05:30

గృహ లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేవరకు అం డగా ఉంటామని ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే కరణం బలరాం

వేటపాలెం(చీరాల), ఏప్రిల్‌ 17: గృహ లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేవరకు అం డగా ఉంటామని ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి స్పష్టం చేశారు. మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ వివే కానంద కాలనీలో వివిధ దశల్లో అసం పూర్తిగా నిలిచిన గృహాలను లబ్ధిదారులు, మున్సిపల్‌, హౌసింగ్‌, విద్యుత్‌శాఖల అధి కారులు మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీని వాసరావు, పలువురు కౌన్సిలర్లతో కలసి శని వారం ఎమ్మెల్యే బలరాం పరిశీలించారు. ముందస్తుగా అసంపూర్తిగా నిలిచిన నిర్మా ణాలు, కొంతమేర నిర్మాణాలు జరిగినా లో పించిన నాణ్యత తదితర అంశాలను పరిశీ లించారు. అనంతరం లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కొన్ని సంవత్సరాలుగా గృహని ర్మాణాలు పూర్తికాక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లబ్ధిదారులు బలరాం దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించి హౌసింగ్‌ డీఈ మాధవరావును ఎమ్మెల్యే వివరణ అడి గారు. దీంతో మొదటి నుంచి జరిగిన పరిణా మాలను ఆయన ఎమ్మెల్యేకు వివరించారు. ప్రాథమికంగా లోపం ఎక్కడన్న విషయాన్ని లబ్ధిదారులు ప్రశ్నించారు. ఈ నేపఽథ్యంలో ల బ్ధిదారులకు గృహనిర్మాణాలు పూర్తిచేసి ఎప్ప టిలోపు అందజేయగలరని బలరాం అధికారు లను ప్రశ్నించారు. దీంతో వారు తమ ప రిధిలోని సానుకల, ప్రతికూల అంశాలను వి వరించారు. కొన్ని నిర్మాణాలు జరిగినా వాటికి ఎందుకు విద్యుత్‌ మీటర్లు మంజూరు చేయ లేదని విద్యుత్‌ అధికారులను ప్రశ్నించారు. ఖచ్చితంగా 1024 మంది లబ్ధిదారులకు న్యాయం జరిగేవరకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా బలరాం పేర్కొ న్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఏసయ్య, ఏపీఓ శ్రీనివాసులు, హౌసింగ్‌, వి ద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది, లబ్ధి దారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-18T06:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising