ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండను కొల్లగొడుతున్నారు..!

ABN, First Publish Date - 2021-04-23T06:21:10+05:30

తర్లుపాడు మండలంలోని నాయుడుపల్లె కొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలి స్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

 2 ఎక్స్‌కవేటర్లు, 10 టిప్పర్లు సీజ్‌

తర్లుపాడు, ఏప్రిల్‌ 22: తర్లుపాడు మండలంలోని నాయుడుపల్లె కొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలి స్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి, రైల్వే డబ్లింగ్‌ ప నులకు ఎక్కువుగా ఈ గ్రావెల్‌ను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా చేరవేస్తున్నారు. కొందరు నాయకులు ట్రాక్టర్‌కు రూ.50, టిప్పర్‌కు రూ.150 వసూలు చేసి సొమ్ము చేసుకుం టున్నారు. గురువారం నాయుడుపల్లె కొండ నుంచి అక్రవ ుంగా గ్రావెల్‌ తవ్వుతున్న విషయం తెలుసుకున్న రెవె న్యూ అధికారులు గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకున్నారు. ఐసీ డీఎస్‌ కార్యాలయంలో సమా వేశానికి హాజరైన తహ సీల్దార్‌ శైలేంద్రకుమార్‌ కార్యా లయం ముందు నిల్చున్న సమయంలో కొండ నుంచి టిప్పర్ల ద్వారా మట్టిని తరలి స్తున్నారు. కళ్లెదుటే టిప్పర్లు పోతుండటంతో కొందరు ప్రజాప్రతినిధులు, విలేకరు లు తహసీ ల్దార్‌ను అడగడంతో రాజకీయ ఒత్తిడి కార ణాల వల్ల ఏమి చేయలేక పోతున్నామని సమాధానం ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లో ఆయా వాహనాలను సీజ్‌ చే యాల్సిందిగా సంబంధిత వీఆర్వో కృష్ణను ఆదే శించారు. వీఆర్వో వెంటనే అక్రమంగా కొండ గ్రా వెల్‌ తవ్వుతున్న 2 ఎక్స్‌వేటర్లు, 10 టిప్పర్లను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. 

జరుగుతుంది ఇలా  

తెల్లపాడు ఇలాకాలోని సర్వే నెం-260లో 268 ఎకరాల కొండ భూమి ఉంది. గత కొన్ని నెల లుగా ఈ కొండ నుంచి ఎక్కువుగా అక్రమంగా గ్రావెల్‌ తవ్వ కాలు జరుగుతున్నాయి. ఈ గ్రావెల్‌ను ఎక్కువుగా రి యల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి, రైల్వే డబ్లింగ్‌ పనులకు టి ప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దేవుడి పేరుతో కొందరు నాయకులు ట్రాక్టర్‌కు రూ.50, టిప్పర్‌కు రూ.150  చొప్పున వసూలు చేస్తున్నారు. నాయుడు పల్లె కొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ తోలుతున్న విషయాన్ని సం బంధిత అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో ఒక్కసారి సంబంధిత వీఆర్వో కృష్ణ గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకుని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన ప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సీజ్‌ చేసిన వాహనాలపై కేసు నమో దు చేస్తారా, లేదా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వది లే స్తా రో అని ప్రజలు చర్చించు కుంటు న్నారు. 


Updated Date - 2021-04-23T06:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising