ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2021-10-19T06:24:33+05:30

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో సోమవారం విద్యార్థులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా బాలికలు వారి హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీనియర్‌ సివిల్‌ జడ్జి  శ్రీనివాసరావు

కనిగిరి, అక్టోబరు 18: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో సోమవారం విద్యార్థులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా బాలికలు వారి హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థపై అవగాహనతో నడుచుకుని ఆదిశగా ఆపద సమయంలో అడుగులు వేయాలన్నారు. బాల్య వివాహాల నిషేధచట్టం, పోక్సో చట్టం, సమాచార హక్కు చట్టాల గురించి నేటి బాలికలకు అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల అక్రమరవాణ నిరోధక చట్టంపై, విద్యాహక్కు చట్టంపై బాలికలకు క్విజ్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు జడ్జి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ , అడ్వకేట్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, న్యాయవాది పాశం పిచ్చయ్య, సీఐ పాపారావు, ఎస్‌ఐ రామిరెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, పారాలీగల్‌ వలంటీర్లు, గుడ్‌హెల్ప్‌ రమే్‌షబాబు, కట్టా శ్రీనివాసరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసులు, ఎంఎ్‌సఆర్‌ కాలేజీ విద్యార్థినులు, హైస్కూల్‌ విద్యార్థినులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising