జగన్ సహనశీలి : వెంకయ్య
ABN, First Publish Date - 2021-10-21T07:01:10+05:30
ముఖ్యమంత్రి జగన్ సహన శీలి, ఆయన తొందరపడి ఎవరినీ దూషించరని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య చెప్పారు.
టంగుటూరు, అక్టోబరు 20 : ముఖ్యమంత్రి జగన్ సహన శీలి, ఆయన తొందరపడి ఎవరినీ దూషించరని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైనా టీడీపీ నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో టంగుటూరులో ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ప్రభుదాసు పాల్గొన్నారు.
కొండపిలో : వైసీపీ మండల కన్వీనర్ గోగినేని వెంకటేశ్వరరావు నాయకత్వంలో నాయకులు కామేపల్లి రోడ్డు నుంచి ర్యాలీగా వెళ్లి మండల కార్యాలయాల సెంటర్ వరకు వెళ్లి దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దొనకొండ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ నేతలు అసభ్య పదజాలాలతో మాట్లాడితే సహించేది లేదని ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళీ హెచ్చరించారు. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను ఖండించారు.
Updated Date - 2021-10-21T07:01:10+05:30 IST