ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన పెట్రో ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-10-29T06:32:21+05:30

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కందుకూరులో ధర్నా నిర్వహించారు.

దర్శిలో వామపక్ష నాయకుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, అక్టోబరు 28: పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కందుకూరులో ధర్నా నిర్వహించారు. స్థానిక సబ్‌ కలెక్టరు కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెబుతోందన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను అదుపు లేకుండా పెంచుతూ దేశాన్ని, ప్రజలను అమ్మకానికి పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఎస్‌ఏ గౌస్‌, బి.సురే్‌షబాబు, ముప్పరాజు కోటయ్య, డాక్టరు మువ్వా కొండయ్య, ఓ.రామకోటయ్య, రామమూర్తి, మల్లిక, రవి, తదితరులు పాల్గొన్నారు.

దర్శి : పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో దర్శిలో గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. స్థానిక గడియారస్తంభం సెంటర్‌లో రాస్తారొకో చేశారు. ఈ సందర్భంగా సీపీఎం దర్శి డివిజన్‌ కార్యదర్శి టి రంగారావు, సీపీఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాగపాకుల రమే్‌షలు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు దరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ధరలు పెంచడం దారుణమన్నారు. పెట్రోలు లీటరు రూ.45కు లభిస్తుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధనంగా రూ.65 పన్నులు వేసి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కెవి పిచ్చయ్య, యు నారాయణ, జూపల్లి కోటేశ్వరరావు, రంగనాయకులు, పుల్లయ్య, కరునానిధి, అంజయ్య, గోగు వెంకయ్య,సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు

దొనకొండలో సీపీఎం నాయకుడు చిరుపల్లి అంజయ్య నేతృత్వంలో  ఎన్టీఆర్‌ విగ్రహం సర్కిల్‌ వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కోలా కిరణ్‌, కుందుర్తి అనీల్‌, ఎర్రగుంట్ల ప్రభాకర్‌, కొండా ప్రాన్సీస్‌, వీరరాఘవులు మరికొందరు సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

 ముండ్లమూరు : పెట్రోల్‌, డీసిల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా దేశ వ్యాప్తంగా చేపట్టిన వామపక్షాల నిరసన కార్యక్రమంలో భాగంగా సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ పీ పార్వతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంటా ఏడుకొండలు, గంగినేని సత్యం, కేవీ పిచ్చయ్య, మన్నం రామాంజనేయులు పాల్గొన్నారు. 

ఉలవపాడులో జరిగిన నిరసనలో  ఆటో వర్కర్స్‌ యూనియన్స్‌ మండల అధ్యక్షుడు ఎస్‌డీ జహిరీ, కార్యదర్శి జే సురేష్‌, సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌డీ గౌస్‌ బాషా, ఎస్‌ మాచర్ల, ఎం కోదండరామ్‌, పల్లపు సుల్తాన్‌, వై రాజారామ్‌, ఎస్‌కే సుల్తాన్‌, రామయ్య, ఆంధోని, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T06:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising