ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు ధర పైనే ఆశలు

ABN, First Publish Date - 2021-03-03T06:29:45+05:30

వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యే తరుణంలో ధరలు ఆశాజనంగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు.

వలేటివారిపాలెంలో క్యూరింగ్‌ అనంతరం రేకలలో ఉంచిన పొగాకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 15 నుంచి పొగాకు కొనుగోలు

- దిగజారిన ఉత్పత్తులు 

వలేటివారిపాలెం, మార్చి 2 : వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యే తరుణంలో ధరలు ఆశాజనంగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక మార్కెట్‌లో నాణ్యమైన పొగాకు కిలో రూ.250లు పలుకుతోంది. అయితే కర్ణాటకలో ఉత్పత్తయ్యే పొగాకు కన్నా, మన నేలల్లో వచ్చే పొగాకులో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లోనూ ఈ ప్రాంత పొగాకుకు మంచి డిమాండ్‌ ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ధరలు చురుగ్గా ఉండవచ్చని రైతులు ఆశిస్తున్నారు.

ఈ ఏడాది పొగాకుకు వాతావరణం అనుకూలించక పోవడంతో దిగుబడి తగ్గింది. నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో అధిక వర్షాలు కురిసి నేలలో తేమశాతం పెరిగింది. దీంతో మొక్కలు సరిగా పెంపురాకపోవడంతో మరోసారి సేద్యం చేసి నాట్లు వేశారు. అయితే ఈ పర్యాయం వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. దీంతో పొగమొక్కలు బెట్టకు వచ్చి ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు వ్యయప్రయాసాలు పడి ట్యాంకర్ల ద్వారా నీటితడులు అందించారు. రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఎర్రరేగడి నేలలో ఎకరాకు మూడు క్వింటాళ్లు, నల్లరేగడి నేలలో ఎకరాకు నాలుగు క్వింటాళ్లకు మించి ఉత్పత్తులు రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో పొగాకు ఉత్పత్తులు బారీగా పడిపోయాయి.

 కందుకూరు పొగాకు బోర్డు పరిధిలో ఈ నెల 15 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అనుమతించినదాని కన్నా ఉత్పత్తి తగ్గనుండడంతో ఆశించిన ధర లభిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నల్లరేగడి నేలలో 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేశారు. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా 3 నుంచి 4 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పొగాకు ఉత్పత్తి తగ్గిందని పొగాకు సరాసరి కిలో పొగాకు రూ 200 నుంచి రూ.250లకు కొనుగోళ్లు చేస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు.

అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం 

పొగాకు సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్దతులపై శాస్రవేత్తలతో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్యపదార్దాలు లేని నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేసేందుకు రైతులు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాం. ఈ ఏడాది పొగాకు పంటకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో పొగాకు దిగుబడులు  తగ్గనుంది.

 లక్ష్మణరావు, కందుకూరు  వేలం నిర్వాహణాధికారి 

Updated Date - 2021-03-03T06:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising