ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షిత సేద్యంతో అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2021-02-27T05:56:37+05:30

రక్షిత సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని మండలంలోని శీలంవారిపల్లి ‘కదిరి బాబూరావు వ్యవసాయ, ఉద్యానవన కళాశాల’ డీన్‌ డాక్టర్‌ జి.భూపాల్‌రాజ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎ్‌సపురం, ఫిబ్రవరి 26 : రక్షిత సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని మండలంలోని శీలంవారిపల్లి ‘కదిరి బాబూరావు వ్యవసాయ, ఉద్యానవన కళాశాల’ డీన్‌ డాక్టర్‌ జి.భూపాల్‌రాజ్‌ తెలిపారు. ఉద్యాన కళాశాలలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థుల అనుభవం, అభ్యసన కార్యక్రమంలో(ఈఎల్‌పీ)లో భాగంగా రక్షత సేద్యంలో ఉద్యాన తోటల పెంపకం విభాగాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధానం ద్వారా నాణ్యమైన సుస్థిరమైన దిగుబడులతోపాటు, పంట కాలంలోనూ, పంటకోత తర్వాత జరిగే నష్టాలను సైతం బాగా తగ్గించవచ్చన్నారు. తద్వారా అన్ని సీజన్లలో పంటలు పండిస్తూ అధిక లాభాలను గడించవచ్చని అన్నారు. రక్షిత సేద్య విధానాన్ని కళాశాల చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్యానవన రైతులకు అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. ఆప్‌ సీజన్‌లో ఈ విధానం ద్వారా కళాశాలలో విద్యార్థులు పుచ్చకాయ, కర్బూజపండ్లను పండించాలన్నారు. కార్యక్రమంలో యూనిట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ వెంకట భాస్కర్‌, మాధవి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising