ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిలావస్థలో పీహెచ్‌సీ సిబ్బంది క్వార్టర్స్‌

ABN, First Publish Date - 2021-05-08T07:40:23+05:30

మండలంలోని కాకర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరాయి. కొన్నేళ్లుగా వాటిలో ఎవ్వరూ ఉండకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

నిరుపయోగంగా ఉన్న వైద్య సిబ్బంది భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని అధికారులు 

మర్రిపూడి, మే 7 : మండలంలోని కాకర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరాయి. కొన్నేళ్లుగా వాటిలో ఎవ్వరూ ఉండకపోవడంతో నిరుపయోగంగా మారాయి. 45 సంవత్సరాల క్రితం పొదిలి సమితి అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన మెల్లల రామిరెడ్డి పని చేసిన సమయంలో కాకర్లకు పీహెచ్‌సీ మంజూరైంది. సువిశాలమైన ప్రాంగణంలో ఆరోగ్యకేంద్రంతోపాటు వైద్యాధికారులు, సిబ్బంది నివాసం ఉండేందుకు భవనాలు నిర్మించారు. కొద్దిరోజులపాటు సిబ్బంది అక్కడ నివాసమున్నారు. అనంతరం వాటిని వినియోగించకుండా వదిలి వేశారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. చిల్లచెట్లు పెరిగి విషపురుగులు సంచరిస్తున్నాయి. ప్రస్తుతం రూ.1.70 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాల పనులు జరుగుతున్నాయి. ఇప్పుడైనా శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన క్వార్టర్స్‌ నిర్మించాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-08T07:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising