ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-06-20T05:44:28+05:30

కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నూకసాని బాలాజీ డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యలపై ఒంగోలు పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు ఏలూరు వెంకటేశ్వర్లు, బాపట్ల పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అన్నదాతలకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగు రైతు ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 19: కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నూకసాని బాలాజీ డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యలపై ఒంగోలు పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు ఏలూరు వెంకటేశ్వర్లు, బాపట్ల పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అన్నదాతలకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 21రోజుల్లో నగదు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండునెలలు దాటినా రైతు ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. ఏలూరి వెంకటేశ్వర్లు, కొండ్రగుంట వెంకయ్యలు మాట్లాడుతూ ఈక్రాప్‌ నమోదులో ఎదురవుతున్న సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సత్వరమే ఆ సమస్యను పరిష్కరించాలన్నారు అనంతరం జేసీ చేతన్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, చుండి శ్యాం, ఎద్దు శశికాంత్‌భూషణ్‌, నల్లూరి కిషోర్‌, పువ్వాడి వెంకటేశ్వర్లు, బాసెం శ్రీను పూసపాటిజాలిరెడ్డి, కేతినేని వీరాంజనేయులు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-06-20T05:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising