ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

ABN, First Publish Date - 2021-10-15T05:38:10+05:30

ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ప్రమోషన్ల కోసం గత కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉద్యోగోన్నతులకు అనుమతి ఇస్తూ పాఠశాల విద్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. టీచర్ల ప్రమోషన్లకు షెడ్యూలు కూడా విడుదలైంది. స్కూలు అసిస్టెంట్లు, గ్రేడ్‌-2 హెచ్‌ఎంల పోస్టులను ఉద్యోగోన్నతులు ద్వారా భర్తీచేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


25న హెచ్‌ఎం ఉద్యోగోన్నతులు 

-29, 30 తేదీలో స్కూలు అసిస్టెంట్లకు

ఒంగోలువిద్య, అక్టోబరు 14 : ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం  ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ప్రమోషన్ల కోసం గత కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉద్యోగోన్నతులకు అనుమతి ఇస్తూ పాఠశాల విద్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. టీచర్ల ప్రమోషన్లకు షెడ్యూలు కూడా విడుదలైంది. స్కూలు అసిస్టెంట్లు, గ్రేడ్‌-2 హెచ్‌ఎంల పోస్టులను ఉద్యోగోన్నతులు ద్వారా భర్తీచేయనున్నారు. గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా స్కూలు అసిస్టెంట్లకు, స్కూలు అసిస్టెంట్లుగా సెంకడరీ గ్రేడ్‌ టీచర్లకు ఉద్యోగోన్నతులు లభించనున్నాయి. గతేడాది నిర్వహించిన బదిలీల్లో బ్లాక్‌చేసిన ఖాళీలు 1-11-2020 తరువాత వచ్చిన ఖాళీలను వీటి ద్వారా భర్తీచేయనున్నారు. 

షెడ్యూలు ఇది 

ఈనెల 16న ఉపాధ్యాయుల ప్రాథమిక సీనియారిటీ జాబితాలను విడుదల చేస్తారు. 18, 19 తేదీల్లో సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 21, 22 తేదీలలో అభ్యంతరాలు పరిష్కరించి 23న తుది జాబితాలు ప్రకటిస్తారు. ఈనెల 25న ఎస్‌ఏలకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా ప్రమోషన్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 29,30 తేదీల్లో ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా ఉద్యోగోన్నతి ఇచ్చేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోన్నతులు ఇచ్చేందుకు సీనియారిటీ జాబితాలు రూపొందిస్తున్నట్లు డీఈఓ బి.విజయభాస్కర్‌ తెలిపారు. 


Updated Date - 2021-10-15T05:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising