ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:11:34+05:30

కందుకూరు మండలంలోని పలుకూరులో బూర్సు ఝాన్సీనాగరాణి(24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

ఝాన్సీ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జనవరి 15 : మండలంలోని పలుకూరులో బూర్సు ఝాన్సీనాగరాణి(24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామ సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఝాన్సీకి పలుకూరుకి చెందిన బూర్సు మాల్యాద్రితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈనెల 11న సాయంత్రం మాల్యాద్రి ఆమెను సచివాలయం నుంచి ఇంటికి తీసుకురాగా బాత్‌రూమ్‌కి వెళ్లిన ఝాన్సీ నాగరాణి ఎంతకూ బయటకు రాలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చూయించి అనంతరం కందుకూరు, ఆ తర్వాత ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆ రోజు రాత్రి ఆమె మృతిచెందింది. మాల్యాద్రే ఝాన్సీ నాగరాణిపై అనుమానంతో ఉరేసి చంపే ప్రయత్నం చేసి కొన ఊపిరి ఉన్నప్పుడు హాస్పటల్‌కి తీసుకెళ్లాడని మృతురాలి బంధువు కుంచాల సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయిన ఝాన్సీనాగరాణిని ఆమె అమ్మమ్మ చదివించి పెళ్లి చేసిందని ఇంతలోనే ఆమె చనిపోవటం విషాదమని బంధువులు రోదించారు.


Updated Date - 2021-01-16T05:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising