త్రిపురాంతకంలో పౌర్ణమి పూజలు
ABN, First Publish Date - 2021-10-21T06:00:25+05:30
పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులు
త్రిపురాంతకం, అక్టోబరు 20 : పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు బుధవారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పాలంక ప్రసాదశర్మ అమ్మవారిని ప్రత్యేంగా అలంకరించిన అనంతరం మహిళా భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Updated Date - 2021-10-21T06:00:25+05:30 IST