ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత రేషన్‌ పంపిణీ పరిశీలన

ABN, First Publish Date - 2021-07-27T05:55:04+05:30

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత రేషన్‌ పంపిణీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత చట్టం 2013 పర్యవేక్షణ సభ్యులు పరిశీలించారు. సోమవారం మండలంలోని పాకలలో రేషన్‌షాపును సందర్శించి డీలర్లు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్నారా లేదా నగదును తీసుకుంటున్నారా అనే విషయాలను కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు

పంపిణీ విధానాన్ని డీలర్‌ను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత చట్టం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగరాయకొండ, జూలై 26 : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత రేషన్‌ పంపిణీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత చట్టం 2013 పర్యవేక్షణ సభ్యులు పరిశీలించారు. సోమవారం మండలంలోని పాకలలో రేషన్‌షాపును సందర్శించి డీలర్లు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్నారా లేదా నగదును తీసుకుంటున్నారా అనే విషయాలను కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ధిష్ట పరిమాణంలో బియాన్ని డీలర్లు అందజేస్తున్నదీ లేనిదీ అనే విషయాలను ఆరా తీశారు. రేషన్‌ దుకాణం అనువైన చోటలో ఉందా లేదా అనే సమాచారాన్ని కార్డుదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. పంపిణీని సాజవుగా సాగించాలని డీలర్‌కు కమిటీ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత సభ్యులు జీఎస్‌ శర్మ, నిర్శల్‌ చిత్తోరా, మంగీలాల్‌ చింపా, డీటీ భూపతి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T05:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising