ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణలో ఐదు పూరిళ్లు దగ్ధం

ABN, First Publish Date - 2021-06-19T05:58:44+05:30

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వర్ణ(పర్చూరు), జూన్‌ 18: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి. కూలి నాలీచేసుకొని కుటుంబాలను నె ట్టుకొస్తున్న నిరుపేదలను అగ్నిప్రమా దం నిలువు నీడను కూడా లేకుండా చే సింది. కట్టుబట్టలతో ఆరు కుటుంబాల కు చెందిన వారు నిరాశ్రయులయ్యారు. చంటి బిడ్డలతో కన్నీరు మున్నీరుగా విల పించి తీరు అందర్నీ కలిచివేసింది. ఈ సంఘటన కారంచేడు మండలం స్వర్ణ ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... స్వర్ణ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద సుమారు 40 ఎస్టీ కుటుం బాల వారు నివాసం ఉంటున్నారు. అందరూ కూలినాలీ చేసుకొని జీవించేవారే. శుక్రవారం విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. 

ఈప్రమాదంలో ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈగ రవణమ్మ ఇంటి సమీపంలో తొలుత నిప్పు రవ్వలు ఎగసిపడి మంటలు అంటుకుని ఇంటిలో ఉన్న దుస్తులు, సామగ్రి కాలిబూ డిదయ్యాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించటంతో సమీపంలోని చెంబేటి కంచమ్మ, బాణావత్‌ రామలమ్మ, ఈగ లక్ష్మీ, ఈతమ్మ, అదుర్ధి, ఈగ ముని స్వాములకు చెందిన ఇళ్లు కూడా బూడిదయ్యాయి. కాలనీ వాసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నికి వాయువు తోడైనట్లు పూరిళ్లలో ఉన్న రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. దీంతో గ్రామస్థులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.

Updated Date - 2021-06-19T05:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising