ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలి

ABN, First Publish Date - 2021-03-07T07:15:24+05:30

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్థేశించుకుని ఆ లక్ష్యసాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని కందుకూరు సీఐ ఎం.విజయకుమార్‌ కోరారు.

ఫ్రెషర్స్‌ డే వేడుకలలో మాట్లాడుతున్న సిఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐ విజయకుమార్‌ 

కందుకూరు, మార్చి 6: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్థేశించుకుని ఆ లక్ష్యసాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని కందుకూరు సీఐ ఎం.విజయకుమార్‌ కోరారు. స్థానిక టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డి గ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టరు ఎం.రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ విజయకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి జీవితంలో డిగ్రీ ఎంతో కీలకమని ఈ దశలో ఉన్నత లక్ష్యాలను నిర్థేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయతీరాలకు చేరుతారన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టరు ఎం. రవికుమార్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సహకారంతో ఈ ఏడాది కళాశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. చక్కని మౌలిక వసతులతో మెరుగైన విద్యాబోధన చేస్తున్నామని వివరించారు. తమ కళాశాలలో చేరి వారిని ఉన్నత స్థితిలో స్థిరపడేలా చూడాలన్న ఏకైక లక్ష్యంతో శ్రమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ  ఎస్సై కేకే తిరుపతిరావు, కళాశాల అధ్యాపకులు డాక్టరు ఎం.ఆంజనేయులు, విజయశ్రీ, మైత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - 2021-03-07T07:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising