ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ABN, First Publish Date - 2021-08-01T07:21:40+05:30

ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని సర్పంచ్‌ పారాబత్తిన కొండమ్మ తెలిపారు.

అగ్రహరం రోడ్డులో మొక్క నాటుతున్న సర్పంచ్‌ కొండమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగపాలెం (వలేటివారిపాలెం) జూలై 31 : ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని సర్పంచ్‌ పారాబత్తిన కొండమ్మ తెలిపారు. మండలంలోని లింగపాలెం నుంచి అగ్రహరం తారురోడ్డు వరకూ రోడ్డుకు రెండు వైపులా శనివారం పంచాయతీ కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో సర్పంచ్‌ కొండమ్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ నాటిన మొక్కలను అలాగే వదిలేయకుండా సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పారాబత్తిన కొండమ్మ, పంచాయతీ కార్యదర్శి ఘటమనేని రాంబాబు, పారాబత్తిన బ్రహ్మయ్య, జేఎల్‌ఎం అల్లాబాషా, వలంటీర్‌ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

నాటిన ప్రతి మొక్క, చెట్టు కావాలి 

కందుకూరు, జూలై 31: మొక్కలు నాటడంతో బాధ్యత తీరిపోదని, వేసిన ప్రతి మొక్క చెట్టు అయ్యేలా కృషిచేయాలని అవెన్యూ ప్లాంటేషన్‌ జిల్లా విజిలెన్స్‌ అధికారి పి.జ్యోతిలక్ష్మిదేవి కోరారు. మండలంలోని కొండి కందుకూరు పంచాయతీలో రోడ్లకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర 700 మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం ఆమె పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను బతికించాలని, నాటినప్పటి నుంచి మూడేళ్లపాటు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుమ్మర బ్రహ్మయ్య, ఏపీవో ఎల్‌వీ.సుజాత,  ఈసీ విజయకుమార్‌,  టీఏ మహేంద్ర  పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-01T07:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising