ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-07-27T06:17:00+05:30

స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు.

ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం 

స్పందనకు భారీగా తరలివచ్చిన ప్రజానీకం

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 26 : స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో కాలువల కింద నష్టపోతున్న భూములకు పరిహారం ఇప్పించాలని ఉప్పుగుండూరుకు చెందిన ఎం.వెంకటేశ్వర్లు, జి.ఆంజనేయులు కోరారు. మరుగుదొడ్లు నిర్మించినట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి అక్రమంగా బిల్లులు తీసుకున్నారని కొండపి మండలం ముప్పవరానికి చెందిన నరసింహరాజు ఫిర్యాదు చేశారు. వెలిగొండ నిర్మాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతాండాలకు చెందిన బాలపిచ్చియ్య, కృష్ణారెడ్డి, పౌలు, అవుల నాగిరెడి కోరారు. గ్రామాలను విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్యాకేజీలను వర్తింపజేసే విధంగా చూడాలని కోరారు. ఆవిధంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పలురకాల సమస్యలపై సుమారు 300కుపైగా అర్జీలు అందజేశారు. జేసీలు వెంకటమురళి, టీఎస్‌చేతన్‌, కేఎస్‌ విశ్వనాథన్‌, కేకృష్ణవేణి, డీఆర్వో తిప్పేనాయక్‌, పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising