ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒరిగిన విద్యుత్‌ స్తంభం

ABN, First Publish Date - 2021-05-09T07:30:28+05:30

మండలంలోని కూనిపాలెం ఎస్‌టీ కాలనీ సమీపంలో ప్రధాన రహదారి పక్కన విద్యుత్‌ స్తంభం ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారి వెంబడి ఒరిగిన విద్యుత్‌ స్తంభం

కూనిపాలెం (వలేటివారిపాలెం), మే 8: మండలంలోని కూనిపాలెం ఎస్‌టీ కాలనీ సమీపంలో  ప్రధాన రహదారి పక్కన విద్యుత్‌ స్తంభం ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉంది. దీంతో రహదారిపై వెళ్లే వాహనదారులకు, పాదచారులకు ప్రమాదం పొంచిఉంది. అయినప్పటికీ విద్యుత్‌ అదికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రధాన రహదారి పక్కన్న ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రదాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. అంతేగాకుండా పాదచారులు నిత్యం ఆ రహదారిపై ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. ఏ క్షణంలో విద్యుత్‌ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు విద్యుత్‌ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఇన్‌చార్జ్‌ ఏఈ మధుబాబు స్పందిస్తూ  త్వరలోనే సరిచేయిస్తామన్నారు.


Updated Date - 2021-05-09T07:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising